నేడు కరీంనగర్ లో నిర్వహించిన పార్టమెంట్ ఎన్నికల యుద్దబేరి సదస్సు కు ముఖ్య అతిధిగా హాజరైన ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్. ఈ కార్యకమానికి ఎల్లారెడ్డిపేట మండలం నుండి జడ్పీటీసి చీటి లక్ష్మణ్ రావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ కార్యకర్తలు బారిగా తరలివెళ్ళారు. కార్యకర్తలను ఉద్దేశించి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రసంగించారు. కరీంనగర పార్టమెంట్ అభ్యర్థి వినోద్ కుమార్ ను గెలిపించుకోవాలని పార్టీలో పనిచేసే వారికి గుర్తింపు లభిస్తుందని పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ ఎమ్మేల్యే గంగుల కమలాకర్, పార్టమెంట్ అభ్యర్థి వినోద్ కుమార్, రాజన్న సిరిసిల్ల అధ్యక్షులు తోట ఆగయ్య, రసమయి బాలకిషన్, తుల ఉమా, ఉద్యమాకారుడు అందె సుభాష్ తదితరులు పాల్గొన్నారు.