బాల వికాస స్వచ్ఛంద సేవా సంస్థ చేస్తున్న సమాజ సేవలు అభినందనీయమని హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు. జమ్మికుంట పట్టణంలోని నూతన వ్యవసాయ మార్కెట్ ప్రాంగణంలో ఆదివారం ఏర్పాటు చేసిన వికాస బాలల పుట్టినరోజు వేడుకల్లో ముఖ్యఅతిథిగా హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వొడితల ప్రణవ్ పాల్గొన్నారు. బాల వికాస కోఆర్డినేటర్లు సభ్యులు వొడితల ప్రణవ్ కి పూలు చల్లుతూ బతుకమ్మలతో ఘనంగా స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ప్రణవ్ మాట్లాడుతూ బాల వికాస స్వచ్ఛంద సేవా సంస్థ చేస్తున్న సమాజ సేవలు అభినందనీయమని అన్నారు. కన్నతల్లిని ఉన్న ఊరును మర్చిపోకూడదనే నానుడిని నిజం చేస్తూ బాలక్క విదేశాల్లో ఉండి ఇక్కడ చేస్తున్న సమాజసేవలో ప్రతి ఒక్కరం పాలు పంచుకోనీ వారి ఆశయాలను ముందుకు తీసుకుపోవాలని ఆయన అన్నారు. కాలుష్యం పెరిగిపోయి ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని దానిని నివారించడానికి ప్రతి ఒక్కరు చెట్లు నాటాలని ఆయన కోరారు. ప్లాస్టిక్ నిషేధించాలని బాల వికాస పేరుతో బట్ట బ్యాగులు తయారు చేయించి అందరికీ అందజేయాలని దానికి తన వంతు సహాయం అందిస్తానని ఆయన తెలిపారు. ఉచితాలు ఎక్కువ రోజులు నిలబడవని నైపుణ్యం పెంచుకొని ముందుకు సాగాలని ఆయన సూచించారు. వికాస బాలల పుట్టినరోజుకు తమ తమ పనులు విడిచిపెట్టుకొని ఇంత పెద్ద మొత్తంలో హాజరైన బాల వికాస తల్లులకు అభినందనలు తెలియజేశారు.కేక్ కట్ చేసి వికాస పిల్లలకు తినిపించి వారి వారి ఉదార స్వభావాన్ని ప్రేమను చాటుకున్నారు. అనంతరం బాలవికాస సభ్యులకు లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పొనగంటి మల్లయ్య, గూడేపు సారంగపాణి, కసబోజుల వెంకన్న, సుంకరి రమేష్, పర్లపెల్లి నాగరాజు, ఎండి సజ్జత్, ఎండి సలీం, ఎండి ఇమ్రాన్, అంబాల ప్రభాకర్, రాజేంద్రప్రసాద్, బాలవికాస స్వచ్ఛంద సేవా సంస్థ సూపర్వైజర్ లత, జమ్మికుంట సెంటర్ మేనేజర్ పబ్బు సులోచన, కోఆర్డినేటర్లు సుమలత, సరోజన, జ్యోతి, ఖాజాభీ, అమూల్య, బాలవికాస సభ్యులు తదితరులు పాల్గొన్నారు.