రేక్కాడితే గాని డొక్కాడని కూలీ నాలీ చేసుకొని జీవించే నిరుపేద కుటుంబం వారిది అబ్బాయి వయస్సు 19 సంవత్సరాలు నడవలేడు, కూర్చోలేడు, ఆయనకు వికలత్వ అర్హతలున్నప్పటికి సదరన్ క్యాంపు లో డాక్టర్ పరీక్షించి జీరో పర్సెంటేజీ సర్టిఫికెట్ ఇచ్చి చేతులు దులిపేసుకున్నాడు. ప్రభుత్వమేమో సదరం క్యాంపులో సంబంధించిన డాక్టర్ చే పర్సంటేజీ సర్టిఫికెట్ తెస్తేనే పెన్షన్ మంజూరు చేస్తామని ఆదేశాలు జారీ చేయడం, ప్రభుత్వము నెల నెల వికలాంగులకు పెన్షన్ డబ్బులు ఇస్తుండడంతో వికలత్వ అర్హతలు ఉన్న తమ కొడుకుకు ప్రభుత్వం నెలనెలా ఇస్తే అట్టి పెన్షన్ డబ్బులతోనైనా తమ కుటుంబాన్ని కొంత వరకు పోషించుకోవచ్చునని ఆ నిరుపేద కుటుంబం ప్రభుత్వ కార్యాలయాలా చుట్టూ గత మూడు సంవత్సరాలుగా తిరుగుతున్న పట్టించుకునే నాథుడే లేడని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కార్తీక్ కళ్ళు చెవులు వినడం తినడం, మలమూత్ర విసర్జన చేయడం బాగానే ఉన్నప్పటికీ ఇంటి నుంచి దూరం నడవలేని, కూర్చోలేని పరిస్థితితో కొట్టుమిట్టాడుతున్నాడు.
ఎల్లారెడ్డిపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి వరకు వికలత్వంతో పాటు పలు ఇబ్బందులు ఎదుర్కోని పూర్తి చేసుకున్న ఆయన ఇంటి నుంచి నడవలేని పరిస్థితిలో ఉన్నాడు పడుకొని ఇంటర్మీడియట్ వరకు ఇంటి వద్దనే చదువుకొని ఇటీవల జరిగిన వార్షిక పరీక్షలో పరీక్షలు రాశాడు, ఇంకా రిజల్ట్ రాలేదు కాగా సిరిసిల్ల సదరం క్యాంపులో డాక్టర్ జీరో పర్సంటేజీ సర్టిఫికెట్ జారీ చేయడంతో సదరం సర్టిఫికెట్ కోసం సిరిసిల్ల కలెక్టర్ కార్యాలయం చుట్టూ డిఆర్డిఏ కార్యాలయం చుట్టూ చెప్పులరిగేలా తిరిగినా పట్నం వెళ్లి ఉస్మానియా, గాంధీ ఆసుపత్రుల చుట్టూ తిరిగిన సదరం సర్టిఫికెట్ రావటం లేదని వికలత్వ అర్హతలున్న తమ కొడుకుకు వికలాంగులకు ఇచ్చే పెన్షన్ డబ్బులు పొందే భాగ్యం తమకు లేదా అని వారు ఆందోళన వ్యక్తం చేశారు.
ఇప్పటికైనా స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు సిరిసిల్ల శాసనసభ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అయినా పట్టించుకుని తమ కుమారుడు కార్తీక్ కు వికలత్వ అర్హతలు ఉన్నాయని సదరం క్యాంపులో వికలాంగులకు ఇచ్చే పర్సంటేజీ సర్టిఫికెట్ తో పాటు వికలాంగుల పెన్షన్ ఇప్పించాలని వికలాంగుడు కార్తిక్ వారి తల్లిదండ్రులు కుంచాల వెంకట్రావు, రేణుక దంపతులు కోరుతున్నారు,