రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మేజర్ గ్రామపంచాయతీ మాజీ సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీని వీడి తిరిగి ఈ నెల 16 తేదిన సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో తన అనుచరులతో చేరారు. వెంకట్ రెడ్డిని, తన అనుచర వర్గాన్ని గురువారం పార్టీ కార్యాలయంలో ఘనంగా సన్మానించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీలో ఎన్ని అవమానాలను భరించానని మళ్ళీ తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీలోకి చేరడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కొరకు కృషి చేస్తామని తెలిపారు. అనంతరం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య మాట్లాడుతూ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కొరకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. ఎన్నికల నియమావళిని పాటిస్తూ వడ్ల కొనుగోలు కేంద్రాలలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్లి తూకాలు సరిగా ఉండేలా చూడాలని రైతులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా ప్రతి ఒక్కరు రైతుల పక్షాన ఉండాలని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. రైతులు తాలు, పెళ్ల, మట్టి లేకుండా చూసుకొని ప్రభుత్వం ఇచ్చిన మద్దతు ధరకు పొందవలసిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, రాజు నాయక్, రాజేందర్, శ్రీనివాస్, నారాయణ, రాజ్ కుమార్, శ్రీనివాస్ రెడ్డి, బిపేట రాజ్ కుమార్, సంతోష్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.