Wednesday, October 21, 2026
spot_img
HomeTELANGANAబిజిగిరిషరీఫ్ లో యువతి అదృశ్యం..

బిజిగిరిషరీఫ్ లో యువతి అదృశ్యం..

జమ్మికుంట మండలం బిజిగిరి షరీఫ్ గ్రామానికి చెందిన సంగి శంకర్, తండ్రి పేరు రాజయ్య అను వ్యక్తికి ముగ్గురు సంతానం పెద్ద కూతురు సంగి అస్మిత, వయసు 19 సంవత్సరాలు కరీంనగర్లో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతుంది. కరీంనగర్ లోనే హాస్టల్లో ఉంటూ చదువును కొనసాగిస్తుంది. ఇట్టి క్రమంలో సంక్రాంతి సెలవులు రావడంతో స్వగ్రామమైన బిజిగిరి షరీఫ్ కు ఎనిమిదవ తారీఖు రోజున ఇంటికి చేరుకుంది. అయితే హాస్టల్లో తన దుస్తులు ఉన్నాయని చెప్పి10వ తారీకు రోజున సంఘీ అస్మిత కరీంనగర్ హాస్టల్ నుండి బట్టలు తీసుకు వస్తానని చెప్పి వెళ్ళి రాత్రి తొమ్మిది అయినా కూడా ఇంటికి రాకపోవడంతో దిగులు చెందిన తల్లిదండ్రులు తనకు ఫోన్ చేయగా ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. వారి బంధువులకు కూడా ఫోన్ చేయగా అక్కడికి రాలేదని తెలపడంతో శనివారం కరీంనగర్ హాస్టల్ కు వెళ్లి తల్లిదండ్రులు విచారించగా తమ కూతురు ఎనిమిదో తారీకు రోజున ఇంటికి వెళ్లినట్టుగా హాస్టల్ సిబ్బంది తెలపగా నేరుగా జమ్మికుంట పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయగా శనివారం రోజున యువతి మిస్సింగ్ కేసును నమోదు చేసినట్టుగా జమ్మికుంట పట్టణ సిఐ వరగంటి రవి తెలిపారు..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments