గుంటూరు: అర్దరాత్రి మంత్రి విడదల రజిని ఆఫీస్ ఎదుట అలజడి చోటు చేసుకుంది, మంత్రి రజిని కార్యాలయంపై దాడికి ప్రయత్నం జరిగింది. న్యూ ఇయర్ సందర్భంగా మంత్రి కార్యాలయం వద్ద టిడిపి శ్రేణులు హడావుడి చేశాయి. నడిరోడ్డుపై వైసీపీ జెండాలను టీడీపీ శ్రేణులు తగలబెట్టాయి. ఈ తరుణంలో కాస్త ఉద్రిక్తత చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు రజిని ఆఫీసు వద్దకు చేరుకుని టీడీపీ కార్యకర్తలను చెదర గొట్టేందుకు యత్నించారు.
అర్దరాత్రి విడదల రజిని ఆఫీస్ ఎదుట అలజడి
RELATED ARTICLES