సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలను ప్రజల్లోకి తీసుకెళ్లకుండా, ప్రజా సమస్యలని సంక్షేమ పథకాలని ప్రజావాణికి వదిలేసి, ప్రజలకు మార్గదర్శకంగా ఉండవలసిన బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు రౌడీలుగా వ్యవహరిస్తున్నారు, కొద్ది రోజుల క్రితం మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, మరి నేడు ఎమ్మెల్యే కె.పి. వివేకానంద. ఒక పోలీస్ అధికారిని దూషిస్తూ, దాడులకు పాల్పడడం అమానుషం, ఎమ్మెల్యే పై కేసు నమోదు చేయాలన్నారు కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు కె.పి.విశాల్ గౌడ్.
ప్రజలకు మార్గదర్శకంగా ఉండవలసిన ప్రజాప్రతినిధులే సహనం కోల్పోయి, అధికారదర్పంతో ఓ పోలీస్ అధికారిని దూషిస్తూ, దాడులు చేసేందుకు ప్రయత్నించిన ఎమ్మెల్యే పై వెంటనే కేసులు నమోదు చేయాలి, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద తీరుకు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా టీవీ ఛానల్ డెబేట్ లో బిజెపి నాయకుని పై దాడి చేయడం ప్రజలందరూ చూడడం జరిగిందని, ఇలాంటి ఎమ్మెల్యే నా గెలిపించుకున్నామని ప్రజల ఆవేదన వ్యక్తం చేస్తున్నారని, త్వరలోనే ఇలాంటి ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ ప్రభుత్వం బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయని ఆయన అన్నారు, గత ప్రభుత్వం తొమ్మిదేళ్ల పాలనలో ప్రజా ఆకాంక్షలు నెరవేర్చకపోగా, రాష్ట్రాన్ని నాశనం చేసింది, అందుకే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారన్నారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపట్టిన ప్రజా పాలన చూసి ఓర్వలేకనే బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ స్థాయిని మరిచి అవాకులు చవాకులు చేస్తున్నారన్నారు. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కు, ప్రజలు బుద్ధి చెప్పినా మారటం లేదు, ఇకనైనా మారకపోతే త్వరలోనే కాంగ్రెస్ కార్యకర్తలే బుద్ధి చెప్తారని గుర్తుంచుకోవాలన్నారు.