రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్లలో ఆత్మహత్య చేసుకున్న సిరిపురం లక్ష్మీనారాయణ భౌతిక దేహానికి సిరిసిల్ల ఏరియా ఆస్పత్రిలో ఆదివారం సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ నివాళులర్పించారు. కుటుంబీకులను పరామర్శించారు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి వద్ద లక్ష్మీనారాయణ కుటుంబాన్ని ఓదార్చి ఆర్థిక సాయం కింద పార్టీ తరఫున 50 వేల రూపాయలు కుటుంబానికి అందించారు. నేతన్న కుటుంబానికి ప్రభుత్వం తరఫున రావాల్సిన ఆర్థిక సహాయంకు సంబంధించి కలెక్టర్ తో కేటీఆర్ మాట్లాడారు