బెండార గ్రామంలో ఐదోవాడ కాలనీ వాసుల సతమతం కథకి ఊరట. ఇంక్విలాబ్ టీవీతో కాలనీ వాసుల సమస్యకు కూసింత పరిష్కారం
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం బెండార గ్రామపంచాయతీలోని బీసీ వాడ కాలనీ వాసులు నెలలుగా సమస్యలతో సతమతమవుతున్న అధికారుల జాడ కానరాక కాలని వాసులు తమ గోడు ఇంక్విలాబ్ టీవీతో వినిపించారు. కథనం వచ్చిన మరుసటి ఉదయాన్నే డ్రైనేజీలు శుభ్రపరచడం, డ్రైనేజీల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లడం జరిగిందని కాలనీ వాసులు స్థానికులు కూసింత దుర్వాసన తగ్గిందని ఇంక్విలాబ్ టీవీకు వారు కృతజ్ఞతలు పేర్కొన్నారు. మరిన్ని సమస్యలు కూడా త్వరితగతిన పరిష్కరించాలని కాలనీ వాసులు స్థానికులు కోరుతున్నారు. సమస్య ఉన్నప్పుడు ఇంక్విలాబ్ టీవీతో కాలనివాసులు, స్థానికులు మాట్లాడుతూ డ్రైనేజీ, సరైన సౌకర్యాలు లేక నాన అవస్థలు పడుతున్నామని కాలని వాసులు వాపోయారు. పలుమార్లు అధికారులకు తెలిసిన అధికారులు ప్రజాప్రతినిధులు పట్టించుకోలేదని డ్రైనేజీలు శుభ్రంగా లేనందున కాలనిలో దుర్గంధం, దుర్వాసనతో మలేరియా, డెంగ్యూ, అనేక వ్యాధులు, విష జ్వరాలతో అనారోగ్యంతో హాస్పిటళ్ల పాలై కష్టనష్టాలను అనుభవిస్తున్న ఎవరు పట్టించుకోకుండా వదిలేశారని చెప్పుకొచ్చారు. అధికారులు చూసిచూడనట్టుగా నిమ్మకు నీరెత్తినట్లుగా వుంటున్నారని కాలని వాసులు అన్నారు. డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండటంతో దోమలు వృద్ధి చెంది, రోగాలు వ్యాపిస్తున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారని ఇంక్విలాబ్ టీవీ కధనం ప్రసారం చేయడంతో అధికారుల్లో కదలిక వచ్చి నేడు కాలనీల్లో చెత్తను శుభ్రం చేసి కాలువల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లారు. దీంతో కాలనీ వాసులు ఇంక్విలాబ్ టీవీ కి కృతజ్ఞతలు తెలిపారు.