తెలంగాణభవన్ సిరిసిల్లలోజరిగిన రైతుదీక్షను విజయవంతం చేసిన BRS కుటుంబ సభ్యులందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపిన జడ్పిటిసి చీటీ లక్ష్మణరావు, పార్టీ మండల అధ్యక్షులు కృష్ణహరి సీనియర్ నాయకులు అందే సుభాష్. BRS పార్టీ పిలుపుమేరకు రేపటినుండి ఎల్లారెడ్డిపేట మండలంలోని ప్రతి గ్రామంలో రైతాంగం పక్షాన కాంగ్రెస్ పార్టీ రైతులకు చేసిన హామీల నెరవేర్చాలని, 500 రూపాయలు బోనస్ ఇవ్వాలని, రైతుబంధును అందరికీ ఇవ్వాలని, రెండు లక్షల రుణమాఫీ చేయాలని, కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని, ఎండిపోయిన పంటకు ప్రతి ఎకరానికి 25000 రూపాయలు చెల్లించాలని రైతుల పక్షాన కొట్లాడుతామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ మధు, సీనియర్ నాయకులు పిల్లి కిషన్, మాజీ సర్పంచ్ లు భూక్యా శంకర్ నాయక్, అజ్మీరా మంజుల రాజు నాయక్, సీత్య నాయక్, సంకురి శంకర్, అనిల్, గడ్డి సురేష్, కనిమేని సాయిలు, రాజయ్య, శేఖర్, రాజు, హనుమంతు, పరశురాం, దేవయ్య, నాగరాజు, రవీందర్, తదితరులు పాల్గొన్నారు