కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా రైతులు వ్యవసాయ భూములలో మిర్చి,మొక్క జొన్న, వేరుశనగ జొన్న పంటలు వేశారు, అవి చేతికి వచ్చే సమయంలో భారీ వర్షాలు కురవడంతో చింతలమలేపెల్లి, బెజ్జురు, కౌటాల, దహెగం, సిర్పూర్ మరియు ఇతర ప్రాంతాలలో రైతులు పంట నష్టపోయారు. సిపిఎం పార్టీ చేసిన సర్వేలో సుమారుగా 9 వేల ఎకరాల పంట నష్టపోయినట్టు తేలింది. మిర్చి, మొక్కజొన్న వేరుశనగ, జొన్న పంటలు వేసిన రైతులు అకాల వర్షాల వల్ల నష్టపోయామని ఈ వర్షాల వల్ల మొత్తం పంట తడిసిపోయి గాలికి కొట్టుకపోయాయని దానితో రైతులు తీవ్రంగా నష్టపోయారని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే కు వినతిపత్రం అందజేశారు. నష్టపోయిన రైతులకు ఎకరాకు 20 వెల రూపాయలు చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని దానితోపాటు ప్రభుత్వము రుణమాఫీని ప్రకటించాలని వినతి పత్రంలో కోరారు. జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించి ఈ విషయంపై వ్యవసాయ అధికారులతో సర్వే చేయించి నష్టపరిహారాన్ని అందించే విధంగా చొరవ తీసుకుంటామని రుణమాఫీపై ప్రభుత్వానికి తెలియజేస్తామని అన్నారు. అనంతరం సిపిఎం పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు జేసిన మీడియా సమావేశంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి కుశన రాజన్న మాట్లాడుతూ రైతులకు నష్టపరిహారం అందించే విధంగా ప్రభుత్వము జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టాలని అన్నారు, ఈ సమావేశంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దుర్గం దినాకర్, సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు గొడిసెల కార్తీక్ జిల్లా నాయకులు గెడం టికనంద్ పాల్గొన్నారు