మెదక్ జిల్లా నూతన పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా అదనపు ఎస్.పి అడ్మిన్ ఎస్.మహేందర్ ఫ్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఫిర్యాదుదారుల సమస్యలను విని వాటిని చట్టప్రకారం పరిష్కరించాల్సిందిగా సంబందిత అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ మండలం కాగజ్ మద్దూర్ గ్రామానికి చెందిన పిల్లుట్ల మహేష్ గౌడ్ నిన్న తేదీ:31.12.2023 ఉదయం 09:30 గంటలకు నా పొలం సర్వే నెంబర్ 244 లో పని చేస్తూ ఉండగా మా గ్రామ పెద్దలందరూ చూస్తుండగా అందరి ముందు నన్ను మా పాలివారు చేతులతో కొట్టడంతో రక్తగాయమైనదని. ఇది ఇలా మూడోసారి నాపై దాడి చేయడం మా పాలివారి వల్ల మాకు ప్రాణభయం ఉంది వారి నుండి ప్రాణ రక్షణ కల్పించి నాకు న్యాయం చేయాలని ఫిర్యాదు చేయగా చట్టప్రకారం ఫిర్యాదికి తగిన న్యాయం చేయమని నర్సాపూర్ ఎస్.ఐ ను ఆదేశంచారు.