ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని శ్రీ రుక్మిణి సత్యబామ సమేత శ్రీ వేణుగోపాల్ స్వామి ఆలయ నిర్మాణానికి కొండగట్టు బృందావన్ రిసార్ట్ యజమాని మర్రిపెల్లి కొండల్ రావు మాధవి దంపతులు ఓక లారీ లోడ్ సిమెంట్ బస్తాలు ఇవ్వడానికి ఆయన మంగళవారం అంగీకారం తెలుపుతూ భక్తుల ఎదుట బహిరంగంగా ఆయన ప్రకటించారు. ఈ సందర్భంగా కొండల్ రావు మాధవి దంపతులను గ్రామ పురోహితులు రాచర్ల కృష్ణ మూర్తి శర్మ, ఆలయ పూజారి నవీన్ చారిలు ఆశీర్వచనాలు అందించారు. ఆలయ కమిటీ అధ్యక్షులు గడ్డం జితేందర్, ఉపాధ్యక్షులు గంట వెంకటేష్ గౌడ్, ప్రతినిధులు బండారి బాల్ రెడ్డి, వంగ గిరిధర్ రెడ్డి, మాజీ ఎంపిటిసి ఒగ్గు బాలరాజు యాదవ్, మెగి నర్సయ్య, పందిర్ల శ్రీనివాస్ గౌడ్, పారిపెళ్లి రాంరెడ్డి, సనుగుల ఈశ్వర్, బందారపు బాల్ రెడ్డి, భక్తులందరూ దంపతులను అభినందించారు,