CWC మెంబర్ రఘువీరా రెడ్డి, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి, సత్యసాయి జిల్లా డిసిసి అధ్యక్షులు N.H ఇనాయతుల్లా, కదిరి కాంగ్రెస్ సీనియర్ నాయకులు నగిరి శ్రీహరి ప్రసాద్ ఆదేశాల మేరకు చిలమత్తూరు మోహన్ గాంధీ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా జరిగిన కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ జన్మదిన వేడుకలు. ఈ సందర్భంగా కదిరి కాంగ్రెస్ నాయకులు చిలమత్తూరు మోహన్ గాంధీ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని కదిరి శివాలయంలో అర్చనలు ప్రత్యేక పూజలు, హజరత్ ఆలం ఖాన్ వలి దర్గా షరీఫ్ నందు, క్లాక్ టవర్ సమీపంలోని C& IGM చర్చి నందు ప్రత్యేక ప్రార్థనలు చేశామని అనంతరం కాంగ్రెస్ నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో కదిరి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి నందు పిల్లల వార్డు, డయాలసిస్ పేషెంట్స్, ఇతర వార్డులో ఉన్న పేషెంట్స్ కు బ్రెడ్ పండ్లు ఇచ్చామన్నారు. కదిరి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. మోహన్ గాంధీ మాట్లాడుతూ దేశంలో కాంగ్రెస్ గాలి వీస్తుందని, రాబోయే రోజుల్లో కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. స్వర్గీయ రాజీవ్ గాంధీ మరణం తర్వాత దేశం కోసం దేశ అభివృద్ధి కోసం ప్రజల కోసం ఈ దేశానికి కాంగ్రెస్ పార్టి అవసరమని.కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత శ్రీమతి సోనియా గాంధీదని, ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఆమె ముందు ఉన్నా సీనియర్ నాయకుడు అయిన మన్మోహన్ సింగ్ కి ప్రధాని బాధ్యతలు అప్పచెప్పి ప్రజల సేవ చేయడం కోసం నేను పని చేస్తానని మహోన్నతమైనప్రధాని పదవిని త్యాగం చేసిన మహా నాయకురాలు, ఆదర్శమూర్తి శ్రీమతి సోనియా గాంధీ అన్నారు. ఈ కార్యక్రమంలో నచ్చు బాలకృష్ణ, మాజీ బిసి సమన్వయకర్త కదిరి మాజీ పట్టణ అధ్యక్షుడు ఖుదాబక్ష్, అష్రఫ్, కదిరి మహిళా అధ్యక్షురాలు నీలోఫర్, కదిరి మాజీ మైనార్టీ అధ్యక్షుడు షేక్ షౌకత్ అలీ ఖాన్, చంద్ర, రాఘవ, ప్రశాంత్, షాహిద్, బాబా, జాఫర్ కార్యకర్తలు పాల్గొన్నారు.
చిలమత్తూరు మోహన్ గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ జన్మదిన వేడుకలు
RELATED ARTICLES


