బిజెపి రాష్ట్ర పార్టీ పిలుపులో భాగంగా శనివారం ఇల్లందకుంట మండలంలోని పలు గ్రామాలలో బిజెపి శ్రేణులు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు సింగిరెడ్డి తిరుపతిరెడ్డి మాట్లాడుతూ బిజెపి ఆవిర్భావ స్ఫూర్తిదాత డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివాస్. పురస్కరించుకొని బీజేపీ ఆధ్వర్యంలో మొక్కలు నాటడం జరిగిందని అన్నారు. ప్రతి కార్యకర్త నాటిన మొక్కను సంరక్షించే బాధ్యత తీసుకోవాలని కార్యకర్తలకు తిరుపతిరెడ్డి సూచించారు. పచ్చని చెట్లు పర్యావరణానికి మెట్లు అని, కావున ప్రతి ఒక్కరూ వారి బాధ్యతగా చెట్లను నాటి సంరక్షించాలని పిలుపునిచ్చారు. చెట్లు నీడనివ్వడమే కాకుండా పర్యావరణకు రక్షణగా ఉంటాయని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు సింగిరెడ్డి తిరుపతిరెడ్డి, ప్రోగ్రాం కోఆర్డినేటర్ కందాల రాజేందర్, మల్యాల సర్పంచ్ గురుకుల సాంబన్న, జిల్లా కార్యవర్గ సభ్యులు ఉప్పుల రమేష్, మండల ప్రధాన కార్యదర్శి ఆరెల్లి శ్రీనివాస్, బూత్ అధ్యక్షులు పుట్టా శ్రీధర్, తిప్పర బోయిన సమ్మయ్య, అనిల్, మరియు కొత్త శ్రీనువాస్, చంద్రమౌళి, ఓదెలు, మల్లయ్య, యుగంధర్, ఐలయ్య తదితరులు పాల్గొన్నారు..