ప్యారీస్(చెన్నై): రాష్ట్రంలో అధికారం డీఎంకేలోని కొందరు నాయకులు మహిళలను గౌరవించడం లేదని సీనియర్ నటి ఖుష్బూ విమర్శించారు. ఇటీవల విరుగంబాక్కంలో జరిగిన డీఎంకే బహిరంగసభలో డ్యూటీలో ఉన్న మహిళా కానిస్టేబుల్‌ను ఆ పార్టీ యువజన విభాగానికి చెందిన వారు అసభ్య పదజాలంతో ధూషించారు. దీనిని ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా ఖండించాయి. తాజాగా, నటి ఖుష్బూ, అన్నాడీఎంకే బహిష్కృత నేత వీకే శశికళ, అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్, మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం తదితరులు సంబంధిత డీఎంకే నిర్వాహకులను పార్టీ నుంచి తొలగించి వారిపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని వేర్వేరు ప్రకటనల్లో డిమాండ్ చేశారు.