భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (DYFI) కుమురం భీమ్ ఆసిఫాబాద్, భారత స్వతంత్ర సమరయోధుడు షహీద్ భగత్ సింగ్ 93వ వర్ధంతి సందర్భంగా డి.వై.ఎఫ్.ఐ నిర్వహించిన జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు ఘనంగా వాంకిడి మండల కేంద్రం రాం నగర్ లో ముగిశాయి. ఈ పోటీల్లో మొదటి బహుమతి సోనపుర్ గ్రామ యువకులు గెలుపొందగా వీరికి వాంకిడి ఎంపీపీ విమలబాయి ముండే తనయుడు బీ ఆర్ ఎస్ మండల యువ నాయకులు దీపక్ ముండే చేతుల మీదుగా అందించారు. మొదటి బహుమతి షీల్డ్ వాంకిడి జెడ్.పి.టి.సి. డా.అజయ్ కుమార్, డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షురాలు చాపిడి శ్రావణి కలిసి అందించారు. రెండవ బహుమతి వెల్గి గ్రామ యువకులు గెలుపొందగా వారికి వాంకిడి వ్యాపారవేత్త గాదె ప్రవీణ్ కుమార్ స్పాన్సర్ చేసిన రెండవ బహుమతి వాంకిడి మండల zptc డాక్టర్ అజయ్ కుమార్ చేతుల మీదుగా అందించారు. రెండవ బహుమతి షీల్డ్ బి.ఆర్.ఎస్ మండల యువ నాయకులు దీపక్ ముండే, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్సులు గెడం టికనంద్, గొడిసెల కార్తీక్ kvps జిల్లా కార్యదర్శి దుర్గం దినకర్, సిపిఐ ఎంఎల్ రెడ్ స్టార్ పార్టీ జిల్లా కార్యదర్శి గోగర్ల తిరుపతి, మాలి సంఘం ఆసిఫాబాద్ డివిజన్ అధ్యక్షులు మెంఘజి, డివైఎఫ్ఐ మండల అధ్యక్ష కార్యదర్శులు దుర్గం నిఖిల్, వడ్లురీ శ్రీకాంత్, డివైఎఫ్ఐ జిల్లా కోశాధికారి దుర్గం రాజ్ కుమార్, కలిసి అందించారు..
డి.వై.ఎఫ్.ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గెడం తికనంద్, గొడిసెల కార్తిక్ మాట్లాడుతూ భగత్ సింగ్ జీవితమే ఒక పోరాటమని విద్యార్థి దశ నుంచే విప్లవ పంథాతో ఎదిగిన వాడని తరువాత క్రమంలో మార్క్సిజం అధ్యయనం ద్వారా పరిపక్వత చెందిన కమ్యునిస్ట్ నాయకుడిగా ఎదిగారు, అదేవిధంగా నేరవని పోరాట పటిమతో బ్రిటీష్ వారికి వెన్ను చూపక గుండె ధైర్యంతో ఉరికంబాన్ని ముద్దాడిన యువ నాయకుడు అని కొనియాడారు.
కబడ్డీ పోటీలకు సహకరించిన వాంకిడి మండల వాసులు వాంకిడి మండల ఎంపిపి విమలబాయి, వాంకిడి మండల జడ్పిటిసి డాక్టర్ అజయ్ కుమార్, వాంకిడి మండల ప్రముఖ వ్యాపారవేత్త గాదె ప్రవీణ్ కుమార్, వాంకిడి గ్రామ ఎంపీటీసీ 1 పీతాంబర్ (తుఫాన్), వాంకిడి మండల లక్ష్మణ సేవ సదన్ వెల్ఫర్ సొసైటీ కమిటీ సభ్యులు గాదె అవినాష్, మౌల్కర్ అశోక్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గుర్నులే నారాయణ, మాజీ సర్పంచ్ బండే తుకారం, వాంకిడి గ్రీన్ హుడ్ డైరెక్టర్ వినోద్, గౌస్, టెలి సంఘం మండల అధ్యక్షులు బండే బాలేష్, మాలి సంఘం మండల అధ్యక్షులు వడై బాబురావు, రజక సంఘం మండల అధ్యక్షులు బిక్షపతి, గ్రామపంచాయతీ కార్మికులు శంకర్, మండలంలోని ఉద్యోగులు మేధావులు వ్యాపారస్తులు శ్రేయోభిలాషులకు పోలీస్ అధికారులకు మీడియా మిత్రులకు ఈ జిల్లా స్థాయి కబడ్డీ పోటీలకు సహకరించిన ప్రతి ఒక్కరికి భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్ఐ కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కమిటీ తరఫున విప్లవాభి వందనాలు తెలియజేస్తున్నాం అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి దుర్గం రాజ్ కుమార్, జిల్లా సహాయ కార్యదర్శి సతీష్, జిల్లా ఉపాధ్యక్షులు పురుషోత్తం, శ్రావణి, మండల అధ్యక్ష కార్యదర్శులు దుర్గం నిఖిల్, వడ్లురీ శ్రీకాంత్, మండల ఉపాధ్యక్షుడు జాడి తిరుపతి, కె.వి.పి.ఎస్ జిల్లా కార్యదర్శి దుర్గం దినకర్, సీ.పి.ఐ (ఎం.ఎల్.) రెడ్ స్టార్ జిల్లా కార్యదర్శి గోగర్ల తిరుపతి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నారాయణ, నాయకులు కిషన్, మాలి సంఘం డివిజన్ అధ్యక్షులు మెంగాజి, అంపైర్ కిరణ్, మారుతి, కిరణ్ గ్రామ పెద్దలు జాదవ్ రాంలాల్ తదితరులు పాల్గొన్నారు.