కేప్‌టౌన్: తొలి టెస్టులో భారత్ ఓటమికి, దక్షిణాఫ్రికా విజయానికి బౌలర్లే కారణమని దిగ్గజ పేసర్ అలెన్ డొనాల్డ్ అభిప్రాయపడ్డాడు. ‘సెంచూరియన్ కంటే రెండో టెస్టు జరగనున్న కేప్‌టౌన్ పిచ్ బౌలర్లకు మరింత కఠిన పరీక్ష పెట్టనుంది. ఇక్కడ వికెట్లు కావాలంటే భారత బౌలర్లు తెలివిగా బౌలింగ్ చేయాల్సి ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే భారత బౌలర్ల సమర్థతకు ఇదొక పరీక్ష. ఇక్కడ స్పిన్నర్లకు ఎలాంటి సహకారం లభించదు. తొలి ఇన్నింగ్స్‌లో పేసర్లకు అనుకూలిస్తుంది’ అని డొనాల్డ్ తెలిపాడు.