రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో శుక్రవారం డిటిఓ లక్ష్మణ్ వాహనాలను ఆపి తనిఖీ చేసి సంబంధిత పత్రాలను పరిశీలించారు. సరైన పత్రాలు లేని వాహనాలను స్థానిక పోలీస్ స్టేషన్లో ఉంచారు. ఈ సందర్భంగా డిటీఓ లక్ష్మణ్ మాట్లాడుతూ వాహనాలు నడిపే డ్రైవర్లకు, యాజమానులకు తగు సూచనలు చేశారు. వాహనాల వెంబడి సరైన ధ్రువీకరణ పత్రాలు కలిగి ఉండాలని, వాహనాలు అధిక వేగంతో నడిపితే వాహనాలు సీజ్ చేస్తామని, మైనర్లు వాహనాలు నడపవద్దని వాహనాలకు ఫిట్ నెస్ ఉండాలని అవగాహన కల్పించారు.