50 లక్షల మంది కార్మికులకు ఉపాధి కల్పించి తీరాలని ఏపీ రాష్ట్ర సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు నరసింగరావు డిమాండ్ చేసారు. వచ్చే ఏడాది జనవరిలో భీమవరంలో జరగనున్న మహాసభలకు సమాయత్తం చేసేందుకు సిక్కోలు నుంచీ సీఐటీయూ ర్యాలీలు నిర్వహిస్తోందని అందులో భాగంగా విజయనగరం కోట నుంచి వై జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నరసింగరావు మాట్లాడుతూకార్మికుల పొట్ట కొడుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గద్దె దిగాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. లక్షలాది కార్మికులకు కనీస వేతనం చెల్లించాలని కానీ పక్షంలో ఉద్యమం తప్పదని హెచ్చరించారు. ఇక కనీస వేతనం 10 వేల నుంచీ 24 వేలు పెంచాలని, బీమా, ఈఎస్ఐ సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ర్యాలీలు నిర్వహిస్తోందని అందులో భాగంగా శ్రీకాకుళంలో సీఐటీయూ ర్యాలీ ప్రారంభమైందని ఆయన తెలిపారు.
50 లక్షల కార్మికులకు ఉపాధి కల్పించి తీరాలి
RELATED ARTICLES

