రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పేట మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలోని పల్లె ప్రకృతి వనానికి, మరియు గిద్దె చెరువుకి డంపింగ్ యార్డుకు వెళ్ళే రోడ్డు మొదటి ఎంట్రన్స్ లోనే గుంత చాల పెద్దగా పడింది. గత కొద్ది రోజుల క్రితం పడిన గుంత ఇంతింతై వటుడింతై అన్న చందంగా గుంత పెద్దగా మారుతుంది. ప్రతి రోజూ గ్రామంలో గల ఇండ్ల నుండి సేకరించిన చెత్తను ఇదే దారి నుండి తీసుకువెళతారు. అదే విధంగా పల్లె ప్రకృతి వనంకు కూడా ఆహ్లాదకరమైన వాతావరణం కోసం ఉదయం పూట మార్నింగ్ వాక్ కు, సాయంత్రం ఈవెనింగ్ వాక్ కు వెళ్తుంటారు. ఇదే దారి గుండా చిన్న పిల్లలు సైతం పల్లె ప్రకృతి వనంలో ఊయలలో సేద తీరాలని కోసం వెళ్తుంటారు. అంటే కాకుండా పాడి పశువులను సైతం మేతకు తీసుకు వెళ్తుంటారు. ప్రతి ఏటా బతుకమ్మ పండగ కోసం ఇక్కడ బతుకమ్మ నిమజ్జనానికి మహిళలు బతుకమ్మ లను తీసుకువెళ్తుంటారు. ఇప్పటికే చాలా మంది రైతుల పాడి గేదెలు ఈ గుంత లో పడి వాటి కాళ్ళు విరిగిపోయాయి. అంతే కాకుండా పాదచారులు సైతం అందులో పడి గాయాలపాలయ్యారు. ఇట్టి ప్రమాదకర గుంతను పూడ్చి ఎలాంటి పెద్ద ప్రమాదాలు జరగకుండా గుంతను పూడ్చి వేయడానికి చర్యలు తీసుకోవాలని ఎల్లారెడ్డి పేట మాజీ ఎంపీటీసీ కాంగ్రెస్ నాయకులు గ్రామ ప్రత్యేకాధికారి సత్తయ్య, పంచాయితీ కార్యదర్శి దేవరాజు లను ఆయన కోరారు.