జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలో ఫిట్టర్ సంపత్ రావు పై విచారణ చేయాలని పబ్బు శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు పై నివేదికకై బుధవారం రీజినల్ డైరెక్టర్ (ఆర్డి). ఎం.ఏ షాహిద్ మసూద్, విచారణ చేపట్టి సంపత్ రావు, ఫిర్యాదు దారు పబ్బు శ్రీనివాస్ లను పూర్తిగా విచారించారు. ఫిట్టర్ విధులకు కావలసిన ఎటువంటి పత్రాలు లేకండా విధులు నిర్వహిస్తున్నారని, ఇచ్చిన ఫిర్యాదు అధారంగా విచారణ చేపట్టినట్లు ఆయన తెలిపారు. సంపత్ రావు యొక్క ITI సర్టిఫికేట్ పరిశీలన చేసిన అనంతరం రీజనల్ డైరెక్టర్ .ఏం ఏ షాహిద్ మసూద్ మాట్లాడుతూ పూర్తి నివేదికను సి.డి.ఏం. ఏ. అధికారికి హైదరాబాద్ కు అందజేయనునట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమీషనర్ మొహమ్మద్ ఆయాజ్, మేనేజర్ జి రాజిరెడ్డి (మేనేజర్ R D ఆఫీస్ ) గుర్రపు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు .


