Tuesday, January 21, 2025
spot_img
HomeCINEMAన్యూ ఇయర్‌... న్యూ లుక్స్‌

న్యూ ఇయర్‌… న్యూ లుక్స్‌

కొత్త సంవత్సరం కొత్త లుక్స్‌తో సినీ ప్రపంచానికి నూతన శోభను తెచ్చే పనిలోవున్నారు మన స్టార్స్‌. రేపు సంక్రాంతికి వెంకటేశ్‌ ‘సైంధవ్‌’, నాగార్జున ‘నా సామిరంగ’, మహేశ్‌ ‘గుంటూరుకారం’, రవితేజ ‘ఈగల్‌’, తేజా సజ్జా ‘హను-మాన్‌’ సినిమాలు సందడి చేయనున్నాయి. సంక్రాంతి అంటే సినిమాల పండగ. పండుగ సినిమాలు కాబట్టి ప్రమోషన్ల హడావిడి కామన్‌. అయితే.. వచ్చే నెలలో విడుదలయ్యే సినిమాలు కూడా ఈ సంక్రాంతి సీజన్‌ని వదలట్లేదు. పనిలోపనిగా ఆ సినిమాల న్యూ లుక్కుల్ని కూడా విడుదల చేసేస్తూ హంగామాను రెట్టింపు చేస్తున్నారు నిర్మాతలు. పండగ సినిమాలైన వెంకటేశ్‌ ‘సైంధవ్‌‘, రవితేజ ‘ఈగల్‌’ న్యూలు క్కుల్ని సదరు నిర్మాతలు కొత్త ఏడాది తొలిరోజున విడుదల చేశారు. వెంకటేశ్‌ సినిమా అంటే భావోద్వేగాల సమ్మిళితంగా ఉంటుంది. అందుకు తగ్గట్టే ఈ న్యూలుక్‌ ఉంది. కూతురుతో ఆడుకుంటున్న తండ్రిలా వెంకటేశ్‌ ఈ లుక్‌లో కనిపిస్తున్నారు. శైలేష్‌ కొలను ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.

ఇక సోమవారం విడుదలైన మరో పండగ సినిమా న్యూలుక్‌ రవితేజ ’ఈగల్‌‘ది. ఈ లుక్‌లో స్టైలి్‌షగా అండర్‌వరల్డ్‌ డాన్‌ని తలపిస్తున్నారు రవితేజ. ఏదేమైనా ఈ న్యూలుక్స్‌ సినిమాలపై అంచనాలు పెంచేలా ఉన్నాయని చెప్పకతప్పదు. ఇక సోమవారం విడుదలైన మరో న్యూలుక్‌ ఎన్టీయార్‌ ‘దేవర’ది. ఇది పండుగ సినిమా కాదు. ఏప్రిల్‌ 5న విడుదల కానుంది. అయితే.. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌ గ్లింప్స్‌ని ఈ నెల 8న విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా సోమవారం తారక్‌ న్యూలుక్‌ని మేకర్స్‌ విడుదల చేశారు. అలలతో ఎగసిపడే సముద్రంలో బోట్‌పైన ఠీవీగా నిలబడ్డ తారక్‌ని ఈ లుక్‌లో చూడొచ్చు. మాస్‌ని మెప్పించేలా ఈ లుక్‌ ఉందని చెప్పొచ్చు. కొరటాల శివ దర్శకత్వంలో రెండు భాగాలుగా తెరకెక్కనున్న ఈ సినిమాలో జాన్వీకపూర్‌ కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. వీటితోపాటు గోపీచంద్‌ ‘భీమా’, గల్లా అశోక్‌ హీరోగా నటిస్తున్న రెండో సినిమా, అంజలి ప్రధానపాత్రలో రూపొందుతోన్న ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ చిత్రాల పోస్టర్లను కూడా సదరు చిత్రాల నిర్మాతలు విడుదల చేశారు. మొత్తానికి పండక్కి విడుదలయ్యే సినిమాలతోపాటు, నిర్మాణంలో ఉన్న సినిమాల న్యూలుక్కులు కూడా తోడవ్వడంతో అటు మీడియా, ఇటు సోషల్‌మీడియాలు కళకళలాడిపోతున్నాయి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments