కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం ఖిరిడి గ్రామంలో భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్ఐ మండల కమిటీ సమావేశం నిర్వహించారు, కేంద్రంలో ఉన్న బిజెపి యువతపై అనుసరిస్తున్న విధానాల పట్ల డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గొడిసెల కార్తీక్ మండల సమావేశంలో మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలో రాకముందు తన మేనిఫెస్టో యువతకు ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని గద్దెనెక్కిన ప్రభుత్వము యువతని మోసం చేసి ఆ మాట మర్చిపోయింది, యువతలో మతోన్మాద విధానాలను అంటకడుతూ మత విద్రోషాలను రెచ్చగొడుతుంది, యువత ఉద్యోగాలు లేక రోడ్డున పడ్డారు, ప్రభుత్వ రంగ సమస్యలను ప్రవేట్ పరం చేస్తూ ప్రభుత్వ ఖజానాని ఖాళీ చేసే ప్రయత్నంలో బిజెపి సర్కార్ ఉంది, ఈ ఐదు సంవత్సరాల పాలనలో ప్రజలకు యువతకు ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి నెరవేర్చలేదు పూర్తిగా విఫలమైంది, పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను విపరీతంగా పెంచి ప్రజలపై భారాలు మోపుతుంది రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వకుండా మోసం చేస్తుంది, అదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎక్కడ కూడా 10 సంవత్సరాల పాలనలో ప్రభుత్వ నూతన పరిశ్రమంలో మంజూరు చేయలేదు కావున యువత భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే బిజెపి మతోన్మాదప్ప ఓడించాలి, యువతకు పిలుపునిచ్చారు, ఇండియా కూటమిలోని భాగస్వామి అయినా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిలను గెలిపించాలి, వారు యువతకు పిలుపునిచ్చారు, ఈ సమావేశంలో డివైఎఫ్ఐ మండల అధ్యక్షులు దుర్గం నిఖిల్, మండల కార్యదర్శి వడ్లురి శ్రీకాంత్, ఖిరిడి డివైఎఫ్ఐ గ్రామ అధ్యక్షులు జాడి తిరుపతి, డివైఎఫ్ఐ గ్రామ కార్యదర్శి దుర్గం కళ్యాణ్, మండల నాయకులు బైరాగోనే తిరుపతి, కిరణ్, గొడిసెల చరణ్, జాడి అరుణ్ తదితరులు పాల్గొన్నారు,