హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వోడితల ప్రణవ్ ఆదేశాల మేరకు హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ మహిళలు నాయకులు కార్యకర్తలు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పధకం ద్వారా 500 లకే గ్యాస్ మరియు గృహజ్యోతి పధకం ద్వారా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం అమలు చేస్తున్న సందర్బంగా హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్యాస్ బండలకు పూల దండలు వేసి, స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ మహిళలు మాట్లాడుతూ ప్రజలకు ఆరు గ్యారెంటీ పథకాలను అందిస్తామని ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం పథకాలను అమలు చేస్తోందని చెప్పారు. ఇప్పటి వరకు నాలుగు పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకుంటున్నారని అదేవిధంగా మ్యానిఫెస్టోలో పెట్టిన విధంగా మిగతా పథకాలు కూడా ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని కాంగ్రెస్ మహిళలు అన్నారు. ఈ కార్యక్రమంలో హుజూరాబాద్ పట్టణ అధ్యక్షురాలు యేముల పుష్పలత మండల అధ్యక్షురాలు లంకదాసరి లావణ్య కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షురాలు ఆలేటి సుశీల సొల్లు సునిత మల్లీశ్వరి కడారి తిరుమల లక్ష్మి రాధ కరీమా మంజులతో పాటు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొల్లూరి కిరణ్ కుమార్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సొల్లు బాబు, యస్సి సెల్ పట్టణ అధ్యక్షులు ఎర్ర రవీందర్, మైనారిటీ పట్టణ అధ్యక్షులు యండి అఫ్సర్, హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్చార్జి మిడిదొడ్డి రాజు యస్సి సెల్ జిల్లా మాజీ కార్యదర్శి ఏర్ర రమేష్ హనుమాన్ దేవాలయ కమిటీ చైర్మన్ కొలిపాక శంకర్, సమ్మెట సంపత్, కుడికాల శ్రీనివాస్, యండి ఖాలిద్ హుస్సేన్, ఏంఎ అలీం, నడిగోటి, మిడిదొడ్డి అమర్, తిరుపతి, రమేష్, ఉప్ప శ్రీనివాస్, యండి తౌసిప్, గంట కిరణ్ రెడ్డి కుమార్, మోరె తిరుపతి, యండి ఆశు, యండి రియాజ్, యండి సాదిక్, KR బిక్షపతి, విల్సన్, రాజమౌళి, ఏర్రబొజ్జు, నారాయణ, నర్సింగ్, కడారి వంశీ తదితరులు పాల్గొన్నారు.