Wednesday, September 16, 2026
spot_img
HomeANDHRA PRADESHమెంతా తుఫాన్ బాధితులకు నష్టపరిహారం ఎప్పుడు చెల్లిస్తారు: డాక్టర్ షేక్ మహబూబ్ వలి

మెంతా తుఫాన్ బాధితులకు నష్టపరిహారం ఎప్పుడు చెల్లిస్తారు: డాక్టర్ షేక్ మహబూబ్ వలి

2025 సంవత్సరంలో మెంత తుఫాను సందర్బంగా భారతదేశంలో అనేక రాష్ట్రాల ప్రజలకు ప్రాణ ఆస్తి నష్టాలు జరిగాయి. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మార్కాపురం జిల్లా తర్లుపాడు మండలం తుమ్మల చెరువు గ్రామ నివాసి పటాన్ ఖాసింబి ఇల్లుకూలిపోయింది. అ సమయంలో పంచాయతీ అధికారులు ఆ కుటుంబానికి సంబంధించిన పూర్తి వివరాలు తీసుకున్నారు. దాదాపు 5 నెలలు కావస్తున్నా ఆ కుటుంబానికి ఇంతవరకు ఎలాంటి నష్టపరిహారం లభించలేదు. ప్రకృతి వైపరీత్యం వలన కుటుంబం తమ నివాసం కోల్పోయినది. ముఖ్యమంత్రి సహాయక నిధి తరుపున కుటుంబానికి ఇంతవరకు నష్టపరిహారం ఎందుకు ఇవ్వలేదు అంటూ ప్రశ్నిస్తూ ఉమ్మడి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సెల్ చైర్మన్ డాక్టర్ షేక్ మహబూబ్ వలి ఆ కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని మండల తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేసారు. తర్లుపాడు మండలం MPDOకి కూడా వినతి పత్రాన్ని అందజేసి బాధితులకు త్వరితగతిన నష్టపరిహారం అందించేలా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని కోరారు. ఆ కుటుంబం నిరుపేదరికంలో జీవనం గడుస్తున్నారు.

మెంత తుఫాను బాధితుల సహాయార్ధం భారతదేశ వ్యాప్తంగా వ్యాపారవేత్తలు, చిత్ర కళాకారులు, క్రీడాకారులు, పారిశ్రామిక వేత్తలు సాధారణ ప్రజలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రికి, మంత్రులకు, ఎమ్మెల్యేలకు కొన్ని వేల కోట్ల రూపాయలు సహాయక నిధి కింద అందించారని కేంద్ర ప్రభుత్వం కూడా మెంతా తుఫాను బాధితుల కొరకు నిధులు అందించినా కూటమి ప్రభుత్వం తుమ్మలచెరువు గ్రామానికి చెందిన పఠాన్ ఖాసింబి కుటుంబానికి ఇంతవరకు ఎందుకు ఆర్థిక సహాయం అందించలేకపోయిందని ప్రశ్నించారు. ఇలాంటి ఎన్నో కుటుంబాలకు కూడా ఆర్థిక సహాయం తక్షణమే అందించడానికి ప్రభుత్వ అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని డాక్టర్ మహబూబ్ వలి మీడియా ద్వారా పేర్కొన్నారు.

ఆ కుటుంబానికి అద్దె ఇల్లు కూడా దొరకక చాలా ఇబ్బందులు పడుతున్నారని కూటమి ప్రభుత్వం కుటుంబానికి తక్షణమే ఇంటి స్థలం కానీ ఇల్లు గాని మంజూరు చెయ్యాలని డాక్టర్ షేక్ మహబూబ్ వలి డిమాండ్ చేశారు..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments