మానుకోటలో ఉద్యమ కారులపై రాళ్ళు రువ్విన వ్యక్తి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అని ఇల్లందకుంట దేవస్థానం మాజీ చైర్మన్ దేశిని కోటి అన్నారు. మంగళవారం జమ్మికుంటలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పోరాడిన వ్యక్తి మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. పదవులను సైతం లెక్క చేయకుండా రాష్ట్ర సాధన ద్యేయంగా పని చేసిన వ్యక్తి అని కొనియాడారు. కళ్ళల్లో పెప్పర్ స్ప్రే కొట్టిన కూడా ఏ మాత్రం వెనుకడుగు వేయలేదన్నారు. ఆలాంటి వ్యక్తిత్వం ఉన్న మంత్రిపై నిరాధారమైన ఆరోపణలు చేస్తే ప్రజలే తగిన బుద్ధి చెప్పే రోజు వస్తుందన్నారు. మంత్రిపై లేని పోని విమర్శలు చేసి మీడియాలో హైలెట్ కావాలని కౌశిక్ రెడ్డి చూస్తున్నాడన్నారు. దళిత మహిళ మంత్రి అని చూడకుండా నిండు అసెంబ్లీలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం బాధాకరం అన్నారు. ఇలాంటి వ్యక్తులను అసెంబ్లీ నుండి బహిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. గతంలో మహిళ గవర్నర్ అని కూడా చూడకుండా చెప్పరాని పదజాలంతో దూషించాడని గుర్తు చేశారు. ఒక ఎమ్మెల్యే లాగా హుందాగా వ్యవహరించకుండా వీధి రౌడిలా మాట్లాడటం చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని, అయిన అతడి వ్యవహార శైలిలో మాత్రం మార్పు రావడం లేదన్నారు.