విలేకరులమని చెప్పి లారీని అడ్డగించి లారీ ఓనర్ ను భయపెట్టి 20,000/- రూపాయలు వసూలు చేసిన ఐదుగురు వ్యక్తులపైన తంగాలపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు సిరిసిల్ల డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి ఆదివారం రోజున ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ 30-03-2024 రోజున సాయంత్రం ఐదు గంటలకు వేములవాడలోని వరలక్ష్మి రైస్ మిల్ నుండి 600 వడ్ల బస్తాలను తీసుకుని సిద్దిపేటకు వెళుతున్న లారీని జిల్లేల వరకు వెంబడించి, లారీని అడ్డగించి డ్రైవర్ ద్వారా ఓనర్ వివరాలు తెలుసుకొని ఓనర్ కు ఫోన్ చేసి డబ్బులు ఇవ్వాలని లేనిచో సంబంధిత అధికారులకు చెప్పి వడ్లపై కేసు నమోదు చేపిస్తామని బెదిరించగా వేములవాడలో ఉన్న రైస్ మిల్లు యజమాని జిల్లెలకు రాగా అక్కడ ఉన్న ఐదుగురు వ్యక్తులు
1పొన్నం.చంద్రమౌళి.
2.దూస.రాజేందర్.
3.చౌటపల్లి.వెంకటేష్.
4.అవునూరి.ప్రశాంత్.
5.నరేష్.లను కలవగా ఆ వ్యక్తులు మేము విలేకరులమని లారీ అక్రమంగా పోతుందని మాకు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసి లారీ ఓనర్ ను భయపెట్టి 20,000/- రూపాయలు వసూలు చేశారన్నారు.