Thursday, October 22, 2026
spot_img
HomeTELANGANAకళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణి చేసిన ఎమ్మెల్యే శ్రీగణేష్.

కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణి చేసిన ఎమ్మెల్యే శ్రీగణేష్.

ప్రభుత్వ పథకాలు అర్హులైన పేదవాళ్లందరికి అందుతాయని,ఆర్దికంగా కొన్ని ఇబ్బందులు ఉన్నా సంక్షేమ కార్యక్రమాల విషయంలో ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు కంటోన్మెంట్ ఎమ్యెల్యే శ్రీగణేష్ నేడు కంటోన్మెంట్ లోని తన నివాసంలో కళ్యాణలక్ష్మి మరియు షాదీ ముబారక్ పథకం లబ్దిదారులకు చెక్కులు పంపిణీ చేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారని ఉచిత బస్సు, 200 యూనిట్ల ఉచిత కరెంటు, 500 గ్యాస్ సిలిండర్, మహిళలను కోటీశ్వరులను చేసే పథకాలు ఇలా మహిళా సాధికారిత దిశగా ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు.

ప్రజల ఆశీర్వాదం రాష్ట్ర ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఉండాలని, అప్పుడే ప్రజలకు సేవ చేయడానికి మరింత శక్తి వస్తుందని ఎమ్మెల్యే శ్రీగణేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న లబ్దిదారులు ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి మరియు స్థానిక ఎమ్మెల్యే శ్రీగణేష్ కు ధన్యవాదాలు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ ఎమ్మార్వో పాండు నాయక్ పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments