ముస్తాబాద్ మండల కేంద్రంలోని గురుకుల పాఠశాలలో ఐదవ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు గల విద్యార్థులకు ఆర్ బి ఎస్ కే ఆధ్వర్యంలోరక్త హీనత పరీక్ష, కంటి లోపాలు పరీక్షలు నిర్వహించారు. గంభీరావుపేట మరియు ముస్తాబాద్ మండల మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అరుణ మాట్లాడుతూ పిల్లలకి పౌష్టికాహార లోపం గుర్తించేందుకు హెచ్బి టెస్టులు చేశామని, హెచ్ బి టెస్ట్ తక్కువ ఉన్న వారి రేంజిను బట్టి ట్రీట్మెంట్ చేశామని అన్నారు. 6 నుంచి 7 వయస్సు ఉన్న వాళ్లకి ఐరన్ ఇంజక్షన్ మిగతా వాళ్ళకి టాబ్లెట్ ఇచ్చారు. పౌష్టికాహార లోపం వల్ల వచ్చే ఎనిమియా లాంటి వ్యాధులను ఎలా అధిగమించాలో ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలని, సీజనల్ వ్యాధులు, వర్షాకాలంలో వచ్చే గజ్జి, జ్వరాలకు పరీక్షలు నిర్వహించి దానికి తగ్గట్లు టాబ్లెట్లు ఇచ్చామని అన్నారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డా. అరుణ, ఆప్తల్మలజిస్ట్ జయప్రకాష్, ఫార్మసిస్ట్ పవిత్ర, ఆశ లత లు ప్రిన్సిపాల్ ఉదయ్ కుమార్ విద్యార్థులు పాల్గొన్నారు.