కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరులోని జ్యోతి బాపూలే విద్యాలయం (ప్రైవేటు పాఠశాల) నిర్వహణ పూర్తిగా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఉంది. విద్యార్థులకు కనీస మౌలిక సదుపాయాలు అయిన త్రాగునీరు కరువైంది. పాఠశాల విద్యార్థులు దాహం తీర్చుకోవాలంటే పాఠశాలకు సుమారుగా 300 మీటర్ల దూరం వెళ్లాల్సిందే. ప్రతిరోజు పాఠశాల విద్యార్థుల దాహం తీర్చడానికి రోజుకు 4, 5 విద్యార్థులు సైకిల్ పైన త్రాగునీరు క్యాన్లతో తీసుకువచ్చి పాఠశాలలో పెట్టాల్సిందే. త్రాగు నీరు పాఠశాల యాజమాన్యం తీసుకురమ్మన్నారని విద్యార్థులు సమాధానం ఇచ్చారు. అంతేకాకుండా జ్యోతిబాపూలే విద్యాలయం యాజమాన్యం 1 నుండి 7వ తరగతి వరకు ప్రభుత్వ అనుమతి తీసుకొని ప్రీ ప్రైమరీ అయిన నర్సరీ, ఎల్కేజీ యూకేజి తరగతులు నిర్వహిస్తున్నారని సమాచారం. జ్యోతిబాపూలే విద్యాలయం అనుమతి ఉన్నది ఒకచోట నిర్వహణ మరొక చోటుగా ఉండి, అర్హత లేని ఉపాధ్యాయులచే విద్య బోధన చేస్తున్నారు. పాఠశాలలో విద్యార్థుల తరగతి గదులలో కూర్చోవడానికి బెంచీలు లేవని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. విద్యార్థుల పట్ల యాజమాన్యం కఠినంగా వ్యవహరించడంపై ఈ మధ్యనే యాజమాన్యంకు, విద్యార్థుల తల్లిదండ్రులకు పెద్ద తగాదా అయిందని పలువురు తల్లిదండ్రులు ఆరోపించారు. ఇదంతా తెలిసిన మండల విద్యాశాఖ అధికారి, కాంప్లెక్స్ ప్రాధాన్య ఉపాధ్యాయులు తనిఖీలు నిర్వహించడం లేదు. ఒకవేళ తనిఖీలు చేసిన ప్రత్యక్షంగా విద్యార్థులతో కానీ, తల్లిదండ్రులతో కానీ మాట్లాడిన పాపాన పోలేదు. పాఠశాలలో కనీస సౌకర్యాలు లేకున్నా మండల విద్యాధికారి చూసి చూడనట్లుగా వ్యవహరించడంలో ఆంతర్యం ఏముందో చెప్పకనే అర్థమవుతుంది. ఇప్పటికైనా జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందించి జ్యోతి బాపూలే విద్యాలయంపై చర్యలు తీసుకోవాలని పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.