వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల గురించి జమ్మికుంట మున్సిపల్ కమిషనర్ ఎండి ఆయాజ్ మాట్లాడుతూ ఇంటి పరిసరాల ప్రాంతాలలో నీరును నిల్వ ఉండకుండా చూడాలని పాత టైర్లు కొబ్బరి బోండాలు లాంటి వాటిలో నీరు నిల్వ ఉండి దోమలు గుడ్లు పెట్టి సంతానాన్ని ఉత్పత్తి చేస్తాయని ఆ దోమల వలన అనేక వ్యాధులు ప్రభలుతాయని ఎల్లప్పుడూ ఇంటి పరిసరాల ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ముఖ్యంగా హౌసింగ్ బోర్డ్ లాంటి లోతట్టు ప్రాంతాల వారు వర్షాలు పడినప్పుడు మురికి కాలువల గుండా వర్షపు నీరు ప్రవాహం ఎక్కువై ఇళ్లల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ సిబ్బంది ఎల్లవేళలా అందుబాటులో ఉంటారని ఏదైనా ఇబ్బంది తలెత్తినప్పుడు మున్సిపల్ కార్యాలయానికి సమాచారం ఇవ్వాలని జమ్మికుంట ప్రజలకు మున్సిపల్ కమిషనర్ ఎండి ఆయాజ్ సూచించారు…