కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండల పోలీస్టేషన్ ను బుధవారం ఆసిఫాబాద్ నూతన ఎస్పీ డివి శ్రీనివాస్ అకస్మాత్తుగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పెండింగులో ఉన్న పలు ఫైళ్లను తనిఖీ చేశారు. స్టేషన్ కు వచ్చే ఫిర్యాదారులతో అమర్యాదగా ఉండకూడదన్నారు. మర్యాదపూర్వకంగా ఉంటూ వారి సమస్యలను వింటూ పరిష్కరించాలని ఎస్సై సాగర్ కు ఎస్పీ సూచించారు. పోలీసులు ప్రజలకు జవాబుదారీగా ఉంటూ ప్రజల మన్నలను నిరంతరం పొందలన్నారు. ఇదిలా ఉండగా స్టేషన్లో లో పోలీసుల సిబ్బంది సమక్షంలో ఏకంగా అక్రమ వడ్డీ డబ్బులు లెక్కింపు వీడియో ఆలస్యంగా మీడియా వెలుగులోకి ఒకటి మంగళవారం వైరల్ గా మారడంతో దాని మరుసటి రోజే ఎస్పీ వాంకిడి పోలీస్టేషన్ ని తనిఖీ చేయడంతో మండల ప్రజలు నూతన ఎస్పీ సూపర్ అని హర్షం వ్యక్తం చేస్తున్నారు.