మూగ ప్రాణులు ఐన నందీశ్వరులకు రక్షణ ఏదీ ఎండాకాలంలో మేతకు వెళ్ళి మనుషుల నిర్లక్ష్య ధోరణిలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోతుంటే వాటి యజమాని ఏమీ చేయలేక ఎటు పోలేక నిరాశక్తుడిగా ఉండిపోతున్నాడు. రైతన్నలకు సాయంగా భూమిని దుక్కిదున్ని మెడలు, ఒళ్ళు, రక్తసిక్తమైనా ములికి కట్టె బరువుకు రక్తాన్ని చిందిస్తూ దేశ వ్యవసాయ రంగంలో మెతుకు పెట్టె ఆ నందీశ్వరులకు రక్షణ కరువైంది. దాహం తీర్చుకొవడానికి మూడు రోజుల క్రితం చిన్న మడుగనుకొని ప్రమాదవశాత్తు బావిలో పడి ప్రాణాలు కోల్పోయిన ఆ మూగ ప్రాణి దుస్థితి చూస్తే కన్నీళ్లు ఆగడం లేదు. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం సరండి గ్రామపంచాయతీ పరిధిలోని దుర్గం సాంబయ్యకు సంబంధించిన పొలంలో భూమి లెవెల్ గా ఓ బావి ఉన్నది అటుగా మేతకు వచ్చిన తేజిగూడ రైతు కమలాకర్ ఎద్దు ప్రమాదవశాత్తు అదులో పడి ప్రాణాలు కోల్పోయింది. ఎండాకాలంలో మూగ ప్రాణులకు నీళ్లు దొరకడం కష్టంగా ఉంటుంది ఎండు మేత తిని దాహంతో అల్లాడి పోతుంటాయి. ఎక్కడ నీళ్లు కనిపించిన పరిగెత్తి దాహం తీర్చుకుని తిరిగి యజమాని నివాసానికి ప్రయాణ మవుతుంటాయి. కానీ కొన్ని చోట్లా మనుషుల నిర్లక్ష్యంతో అభం శుభం తెలియని మూగ ప్రాణులు బలి అవుతున్నాయి. ఎద్దు చనిపోవడాన్ని అటుగా వెళ్తున్న ప్రజలు మూడు రోజులుగా బావిలో పడి దుర్వాసన వస్తుండటంతో స్థానిక రైతులు ఎద్దు కోసం మూడు రోజులుగా గాలిస్తున్న యజమానికి తెలియ పరిచినట్లుగా సమాచారం. ఏదేమైనా మనుషులు కూసింత జంతువుల పట్లా వాటి ప్రాణాల పట్లా బాధ్యతగా పొలాల్లో బావులను గ్రామాల్లో కట్టి నట్లుగా ఎత్తుగా కడితే బాగుంటుందని అలాగే పొలాల్లో బావులకు చుట్టుపక్కల రక్షణ కవచాలను అమార్చాలని సాటి రైతన్నలు కోరుచున్నారు.