తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నూతన అధ్యక్షులు గా నియమించబడిన బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కు శుభాకాంక్షలు తెలిపిన ఇల్లందకుంట మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఇంగిలే రామారావు. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం రహమత్ నగర్ కు చెందిన మహేష్ కుమార్ గౌడ్ విద్యార్థి దశలో నుండే NSUI లో చేరారు. అప్పటి నుంచి కాంగ్రెస్లో కొనసాగారు. ఉమ్మడి రాష్ట్ర హయాంలో పార్టీ అధికారంలో ఉన్న సమయంలో సామాజిక సమీకరణాల వల్ల అవకాశం రాకున్నా వివిధ హోదాల్లో పనిచేశారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత పలువురు నేతలు పార్టీ మారిన ఆయన కాంగ్రెస్లో కొనసాగారు. 2021 లో వర్కింగ్ ప్రెసిడెంట్ గా అవకాశాన్ని కల్పించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆయనకు జనవరిలో ఎమ్మెల్సీగా ఎంపీక చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, ఆశీస్సులు మంత్రులతో చక్కటి సమన్వయం చేసుకుంటూ పనిచేసిన అనుభవం ఉండడం ముఖ్యంగా గతం మూడేళ్లుగా పార్టీ సంస్థాగత వ్యవహారాలను చక్కబెడుతుండడాన్ని పరిగణలోకి తీసుకున్న అధిష్టానం మహేష్ కుమార్ గౌడ్ BC లో ఎవరికిచ్చినా పరస్పరం సహకరించుకుంటామన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేసినట్లు సమాచారం. అధిష్టానం అన్ని ఆలోచించి చివరికి మహేష్ కుమార్ గౌడ్ పిసిసి అధ్యక్షులు గా నియమించింది అని ఇల్లందకుంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఇంగిలె రామారావు, శుభాకాంక్షలు తెలిపారు..