ఏలేరు వరదలకు అతలాకుతలమైన ప్రజలను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వరద బాధితులను ఆదుకునేందుకు చేపట్టిన కార్యక్రమాల్లో భాగంగా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, కాకినాడ జిల్లా టిడిపి అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్ ఆదేశాలతో కిర్లంపూడి మండలం సోమరాయణం పేట గ్రామంలో క్లస్టర్ ఇంచార్జి పాఠంశెట్టి మురళీకృష్ణతో కలిసి టిడిపి నాయకుడు పెనగంటి బాబ్జి నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం అందించిన 25 కేజీల బియ్యం, కందిపప్పు, బంగాళదుంపలు, ఫామాయిల్, ఉల్లిపాయలు, పంచదార పంపిణీ చేస్తున్నామని కిర్లంపూడి మండల తెలుగుదేశం పార్టీ బిసి నాయకుడు పెనగంటి బాబ్జి అన్నారు. ప్రభుత్వం సంఘటన జరిగిన వెంటనే స్పందించి ప్రజలను ఆదుకోవడంలో తెలుగుదేశం పార్టీ ముందు ఉంటుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ పీలా మహేశ్వరరావు, టిడిపి నాయకులు బుద్ధ రామచంద్ర రావు, రాపేటి ఆదిబాబు తదితరులు పాల్గొన్నారు.
వరద బాధితులకు అండగా కూటమి ప్రభుత్వం: పెనగంటి బాబ్జి
RELATED ARTICLES