కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో గురువారం నిర్వహించిన ‘జన గర్జన’ సభలో రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. తెలంగాణకు మోదీ ఇచ్చిందేమీ లేదు ‘గాడిద గుడ్డు’ తప్ప అని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణకు మద్దతుగా ప్రచారం చేశారు. ఆదిలాబాద్ పార్లమెంట్ నుంచి పోటీ చేస్తున్న ఆదివాసీ బిడ్డ ఆత్రం సుగుణను గెలిపించాలని కోరారు. మంత్రి సీతక్క ఆదిలాబాద్ జిల్లా ప్రజల కోసం అహర్నిశలు కష్ట పడుతోందని కొనియాడారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సమస్యలను కేసీఆర్ ఎన్నడు పట్టించుకోలేదని విమర్శించారు. ఆదివాసీలు, గోండ్‌లు, కొమురం భీం పట్ల బీజేపీ చిన్నచూపు చూసిందని తెలిపారు. ఆదిలాబాద్ అంటే నాకు అమితమైన ప్రేమ. ఇంద్రవెల్లి అమరవీరుల కుటుంబాలకు ఇళ్లు ఇచ్చాం. పదేళ్లు అధికారంలో ఉన్న బీజేపీ, బీఆర్ఎస్ ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి చేయలేదు’ అని రేవంత్ రెడ్డి విమర్శించారు. ‘2021లో దేశ జనాభాను బీజేపీ ప్రభుత్వం చేయలేదు. మోడీ, అమిత్ షా జనగణన చేయకుండా అడ్డుకుంటున్నారు. జనాభా లెక్కింపు జరిగితే పెరిగిన జనాభాకు అనుకూలంగా కులాలకు రిజర్వేషన్లు పెంచాలి కాబట్టి బీజేపీ ప్రభుత్వం చేయలేదు’ అని రేవంత్ రెడ్డి తెలిపారు.
ఢిల్లీ పోలీసులు కాదు… ఢిల్లీ సుల్తాన్ వచ్చిన ప్రజలు అండగా ఉంటే ధైర్యంగా ఎదుర్కొంటానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్, బీజేపీ ఆదిలాబాద్ జిల్లాకు ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా తీవ్ర అన్యాయం చేశారని ఆరోపించారు. దొర లక్షణాలు గల గేడం నాగేష్ కు ఎంపీ టికెట్ ఇచ్చి సోయం బాపురావుకు బీజేపీ మోసం చేసి, గిరిజనులపై కపటప్రేమ చూయిస్తుండ్రని ఎద్దేవా చేశారు. గోండులు, లంబాడాలు తమ హక్కుల కోసం పోరాటాలు చేస్తే మోడీ, కేసీఆర్ పట్టించుకోలేదన్నారు. అధికారంలో ఉన్న కేసీఆర్, మోదీ ఏనాడూ గిరిజనుల సమస్యలను పట్టించుకోలేదని కనీసం పోడు భూముల సమస్యలపై కేసీఆర్ దృష్టి పెట్టలేదని ఈ ప్రాంతంలో విద్యాభివృద్ధికి కృషి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించలేదని కేంద్ర మంత్రి వర్గంలో గోండులకు స్థానం ఇవ్వలేదని గుర్తు చేశారు. ప్రధాని మోదీ, అమిత్ షా తనను బెదిరించలేరని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. రిజర్వేషన్లు కొనసాగాలంటే కాంగ్రెస్ ను గెలిపించాలన్నారు. ఆదిలాబాద్ ప్రజలు అండగా ఉన్నంత కాలం ఢిల్లీ సుల్తాన్లను అయినా ధైర్యంగా ఎదుర్కొంటానని కేసీఆర్ పదేళ్లు 200 కేసులు పెట్టిన భయపడని తనపైకి ఢిల్లీ పోలీసులను ఉసిగొల్పితే కుమ్రంభీం, రాంజీ గోండు మాదిరిగా తిరగబడతారని సీఎం హెచ్చరించారు.