హిందూపురం పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం కో ఆర్డినేటర్ యం.ఇ.కిఫాయాతుల్లాను పట్టణంలోని అహమ్మద్ నగర్, సిపియం కాలని, నేతాజీ నగర్ కు చెందిన కిఫాయాతుల్లా యువ సైన్యం శుక్రవారం సాయంత్రం మర్యాద పూర్వకంగా కలిశారు. డిసిసి అద్యక్షులు యం.హెచ్. ఇనయతుల్లా ఆశీస్సులతో పిసిసి అధ్యక్షురాలు శ్రీమతి షర్మిళ చేతుల మీదుగా ఇటీవల కిఫాయాతుల్లా కాంగ్రెస్ పార్టీ హిందూపురం అసెంబ్లీ కో ఆర్డినేటర్గా పదవీ బాధ్యతలు చేపట్టిన శుభ సందర్భంగా కిఫాయాతుల్లాను పుష్ప గుచ్చం అందించి శాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. రాబోవు కాలమంతా జాతీయ కాంగ్రెస్ పార్టీ వైపే యువత, దేశ ప్రజలు మొగ్గుచూపుతున్నారని రాహూల్ గాంధీ, శ్రీమతి ప్రియాంకా గాంధీ స్ఫూర్తితో యువతే రాజకీయాలలో రాణిస్తుందని చెప్పడానికి హిందూపురానికి కాబోయే యువ ఎమ్మేల్యే కిఫాయాతుల్లా నాయకత్వములో ఆయన అడుగుజాడలలో నడచి కిఫాయాతుల్లాకు బ్రహ్మరథం పట్టి హిందూపురం ప్రజలకు సేవలందిస్తామని పేర్కోన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ యువసైన్యం నాయకులు కార్యకర్తలు పాల్గోన్నారు.
అసెంబ్లీ కోఆర్డినేటర్ కిఫాయాతుల్లాను మర్యాద పూర్వకంగా కలిసిన పట్టణ కిఫాయాతుల్లా యువ సైన్యం
RELATED ARTICLES