మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు, సీనియర్ బీజేపీ నేత ఈటల రాజేందర్ కు మారేడ్ పల్లి కి చెందిన సీనియర్ నాయకులు ఎన్.నాగభూషణం ప్రత్యేకంగా డ్రైఫ్రూట్స్ తో తయారు చేసిన 12 కిలోల డ్రైఫ్రూట్స్ లడ్డూను బహుకరించారు. 11 ఏండ్ల నరేంద్ర మోదీ బీజేపీ పాలన పూర్తయిన సందర్బంతో పాటు ఎంపీ ఈటల రాజేందర్ విజయసంకల్ప యాత్ర పూర్తయి ఒక ఏడాది గడిచినా సందర్బాన్ని పురస్కరించుకొని ఆదివారం సికింద్రాబాద్ ఇంపీరియల్ గార్డెన్ లో అట్డహాసంగా ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ కార్యక్రమంలో ఎంపీ ఈటల రాజేందర్ ను నాగభూషణం సన్మానించారు. కార్యక్రమంలో బీజేపీ పార్లమెంట్ కన్వీనర్ జేవీ నర్సింగ్ రావు, కంటోన్మెంట్ కన్వీనర్ విజయానంద్, నాయకులు బీఎన్ శ్రీనివాస్, సచిన్, రాజ్ మల్లేశ్, జగన్, కంటోన్మెంట్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

