జగిత్యాల జిల్లా మల్యాలలో BJP సభ్యత్వం కార్యక్రమంలో పాల్గొన్న BJP జిల్లా జాయింట్ కోఆర్డినేటర్ జాడి బాల్ రెడ్డి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పరిపాలనను స్వాగతిస్తూ జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని బూత్ అద్యక్షులు, మండల ఇన్చార్జిలు అన్ని కులాల వారితో బిజెపి సభ్యత్వం నమోదు చేయించాలని అన్నారు. కాంగ్రెస్, బిఆర్ఎస్ ప్రభుత్వ పనితీరు ప్రజలందరికీ అర్థమైందని ప్రజలంతా బిజెపి వైపు చూస్తున్నారని వారందరినీ సభ్యత్వ నమోదులో భాగస్వామ్యం చేయడానికి పార్టీ శ్రేణులు సమిష్టి కృషి చేయాలన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ ను నమ్మి ఓట్లు వేస్తే అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని 300 రోజులైనా ఆరు గ్యారంటీలను అమలు చేయకపోవడంతో ప్రజలంతా కాంగ్రెస్ ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉన్నారని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పది నెలల్లో 80 వేల కోట్ల అప్పుచేసి ఏం సాధించిందో అర్థం కావడం లేదన్నారు.
కాంగ్రెస్, టిఆర్ఎస్ ప్రభుత్వాలు ధనిక తెలంగాణను అప్పుల తెలంగాణగా మారుస్తున్నాయని ఆయన మండిపడ్డారు. ఎన్నికల ముందు నుంచి ఇప్పటిదాకా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నో హామీలు ఇచ్చారని కానీ వాటిలో ఒకటి కూడా అమలులోకి రావడం లేదని కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్ధ పాలనతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారనీ ముఖ్యంగా రైతుల సంక్షేమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజాపాలన కొనసాగుతుందని ప్రగల్బాలు పలుకుతున్నారే తప్ప వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ ప్రజల నమ్మకం కోల్పోయిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో చొప్పదండి అసెంబ్లీ కన్వీనర్ పేరుక శ్రావణ్, బిజెపి సీనియర్ నాయకులు బొట్ల ప్రసాద్, మధుట్ల మాజీ సర్పంచ్ రమేష్, ఉప సర్పంచ్ లక్ష్మారెడ్డి, సురేష్, గాజుల మల్లేశం మల్యాల మండల బూత్ అద్యక్షులు శక్తి కేంద్ర నాయకులు కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు

