రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ గ్రామానికి చెందిన మట్ట సురేష్ భార్య దీప్తి (45) నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి వద్ద రోడ్డు ప్రమాదంలో మరణించారు. బొప్పాపూర్ గ్రామానికి చెందిన మట్ట సురేష్ (50) తన భార్య దీప్తి (45) కూతురు సమీక్ష (15) లు కలిసి హైదరాబాదులో నివసిస్తున్నారు, నిర్మల్ జిల్లాలో బంధువులు “ఆడెల్లి పోచమ్మ” బోనాల పండుగ చేసుకోవడంతో ఈ యొక్క కార్యక్రమానికి హాజరు కావడానికి నేడు ఉదయం హైదరాబాదు నుండి సురేష్ మరియు తన భార్య దీప్తి తో నిర్మల్ జిల్లాకు కారులో బయలుదేరారు డిచ్పల్లి వద్ద కారు రోడ్డు ప్రమాదానికి గురి కావడంతో సురేష్ భార్య దీప్తి అక్కడికక్కడే మరణించింది. సురేష్ కు ఎలాంటి ప్రాణహాని జరగలేదు.తల్లి మరణ వార్త తెలుసుకొన్న కూతురు సమీక్ష మరియు కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు, ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది

