Wednesday, May 29, 2024
spot_img
HomeCINEMA‘వాల్తేరు వీరయ్య’ రవితేజ ఫస్ట్‌లుక్ ఔట్

‘వాల్తేరు వీరయ్య’ రవితేజ ఫస్ట్‌లుక్ ఔట్

చాలా ఏళ్ల క్రితం చేసిన ‘అన్నయ్య’ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి మాస్ మహారాజా రవితేజ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. మెగాస్టార్ మెయిన్‌ లీడ్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో రవితేజ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ మూవీకి సంబంధించి పోస్టర్స్, టీజర్స్ ఇప్పటికే విడుదలై మంచి రెస్పాన్స్‌ని అందుకున్నాయి. తాజాగా రవితేజ ఫస్ట్ లుక్‌ని చిరంజీవి విడుదల చేశాడు. కొన్ని రోజుల క్రితమే రవితేజ ఫస్ట్ లుక్‌ని డిసెంబర్ 12వ తేదీ ఉదయం 11:07 గంటలకు విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు.

తాజాగా రవితేజ ఫస్ట్ లుక్‌ని మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశాడు. ఓ చేతిలో గొడ్డలితో సిలిండర్‌ని పట్టుకుని.. మరో చేతిలో చాలా జాగ్రత్తగా మేకపిల్లని పట్టుకున్న ఈ పోస్టర్ ఊర మాస్‌గా ఉంది. ఆ పోస్టర్ మీద.. ‘పవర్‌కి కొత్త పేరు విక్రమ్ సాగర్ ఏసీపీ’ అని రాసి ఉంది. ఈ చిత్రంలో రవితేజ్ క్యారెక్టర్ పేరు విక్రమ్ సాగర్. అంతేకాకుండా, ఈ పోస్ట్‌కి.. ‘అతని బ్యాగ్రౌండ్ – కేవలం హార్డ్ వర్క్.. అతని సపోర్ట్ – ప్రేమించే మాస్.. రవితేజని విక్రమ్ సాగర్ ఏసీపీగా పరిచయం చేస్తున్నాం’ అని రాసుకొచ్చాడు. అలాగే రవితేజ సైతం ఈ పోస్టర్‌ని పోస్ట్ చేసి తన సంతోషాన్ని పంచుకున్నాడు.

కాగా, బాబీ కొల్లి (కె.ఎస్. రవీంద్ర) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. చిరంజీవి సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ మూవీకి రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రం సంక్రాంతిని కానుకగా 13 జనవరి, 2023న ప్రపంచవ్యాప్తంగా చాలా గ్రాండ్‌గా విడుదల కానుంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments