తప్పుడు నెంబర్ వాహనాలు, ఒక నెంబరుకు బదులు వేరొక నెంబరు అమర్చినా ,సైలెన్సర్ మార్పిడి చేసి నడిపే వాహనాలు సీజ్. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో ఈరోజు DSP కె నాగేంద్ర చారి నెంబర్ లేని, ఒక నెంబర్ కు బదులు వేరొక నంబరు సైలెన్సర్ మార్పిడి ఉన్నటువంటి వాహనాలను తనిఖీలుచేసి వాటన్నిటిపై చట్ట ప్రకారము చర్యలు చేపట్టారు. కావున మరొకసారి డివిజన్ ప్రజలందరికీ కూడా మా యొక్క పోలీసు విజ్ఞప్తి ఏమనగా వెహికల్ చట్టం లోబడి వాహనాలను నిర్దిష్ట నెంబరు వాహనానికి బిగించబడి ఉండాలి. తప్పుడు నెంబర్లు ఉండకూడదు, వాహన నంబర్ వెనకాల వేరే డిజైన్లతో వేరే బొమ్మలు ఉంచడం, నెంబర్ ప్లేట్ మల్చడం ఉండకూడదు. కావున ప్రజలందరూ పోలీసు వారికి సహకరించి ప్రమాదాల బారిన పడకుండా నేరాల్లో పాల్గొనకుండా పోలీసు వారికి సహకరించగలరని తెలియజేశారు.