ఆత్మీయత మతసామరస్యానికి ప్రతీక ఇప్తార్ విందు అన్నారు బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దోమ్మాటీ నర్సయ్య. పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలో ఉండే ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందు ఆత్మీయత మతసామరస్యానికి ప్రతీక అని బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దోమ్మాటీ నర్సయ్య అన్నారు. శుక్రవారం ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని మహామ్మదీయ మజీద్ లో జగమే ఖదీమ్ మజీద్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దోమ్మాటీ నర్సయ్య, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి పాల్గొన్నారు, ఈ సందర్భంగా మౌల్వి ఫయాజ్, సదర్ సాబ్ అయూబ్, నయాబ్ సదర్ షాదుల్, సదర్ సాబ్ రఫీక్, నయాబ్ సదర్ జహాంగీర్ లకు ధన్యావాదాలు తెలిపారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముస్లిం సోదరులు రంజాన్ మాసం అంతా భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారని, పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు ఆచరించే ముస్లిం సోదరులు ఇచ్చే ఇఫ్తార్ విందు మతసామరస్యానికి ప్రత్యేకగా నిలుస్తాయన్నారు.
ఇప్తార్ విందు కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు చెన్ని బాబు, కాంగ్రెస్ పార్టీ నాయకులు నేవూరి రవీందర్ రెడ్డి, బండారి బాల్ రెడ్డి, నంది కిషన్, గుర్రపు రాములు, గుండాడి రాం రెడ్డి, గంట వెంకటేష్ గౌడ్, గంట ఆంజనేయులు గౌడ్, వడ్నాల ఆంజనేయులు, నాగార్జున రెడ్డి, మద్దుల, శ్రీపాల్ రెడ్డి, సాధు సాయిరెడ్డి, బీపేట రాజకుమార్, నెమలి కొండ సత్తయ్య, భూక్య రాజు నాయక్, రేసు ధర్మెంధర్, డాక్టర్ అమరేందర్ రెడ్డి, రావుల లింగారెడ్డి, తదితరులు పాల్గొన్నారు,