కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం ఖిరిడి గ్రామంలో అంబేద్కర్ 133 వ జయంతి వేడుకలు డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గొడిసెల కార్తీక్ మాట్లాడుతూ అంబేద్కర్ ఒక సామాజిక వర్గానికి చెందిన వాడు కాదు సమ సమాజ నిర్మాణానికి కృషి చేసిన మహనీయుడు, సమాజంలో అత్యున్నత స్థానాలకు ఎదగాలంటే చదువు విజ్ఞానంపై దృష్టిపెట్టాలని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అన్నారని, నిమ్న కులాలలో జన్మించినప్పటికీ అత్యున్నత చదువులు చదివి ప్రపంచ మేధావిగా ఎదిగారని, ఐక్యరాజ్యసమితి సహితం అంబేద్కర్ జయంతి వేడుకలు జరుపుతుందంటే అంబేద్కర్ ఎంతటి మహానుభావుడో అర్థం చేసుకోవాలన్నారు. భారత రాజ్యాంగం ప్రమాదంలో ఉంది, మనువాద మతోన్మాదులు భారత రాజ్యాంగాన్ని మార్చే దిశలో ప్రయాణిస్తున్నారు వారికి అడ్డుకట్ట వెయ్యాలంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత అనేది అవసరం దేశవ్యాప్తంగా ఏదో రూపంలో మతోన్మాదులు దాడులు చేస్తా ఉన్నారు, వారిని అడ్డుకోవాలంటే అంబేద్కర్ సిద్ధాంతాలని ప్రజల్లో వినిపించాలి, ఆయన సిద్ధాంతాలను ప్రతి ఒక్కరు పాటించాల్సిన అవసరం ఉందన్నారు, అంబేద్కర్ సిద్ధాంతంతో మతోన్మాదాన్ని అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి దుర్గం దినకర్, డివైఎఫ్ఐ మండల అధ్యక్షులు దుర్గం నిఖిల్, డివైఎఫ్ఐ మండల ఉపాధ్యక్షులు జాడి తిరుపతి, డివైఎఫ్ఐ గ్రామ నాయకులు కిరణ్, దిలీప్, కెవిపిఎస్ నాయకులు వాసుదేవ్ తదితరులు పాల్గొన్నారు,