ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు లక్షల రైతు రుణ మాఫీ ప్రకటించడంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు నిర్వహించారు. ఇరోజు కంటోన్మెంట్ 1వ వార్డులో టీపీసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ బద్దం బల్వంత్ రెడ్డి అధ్వర్యంలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్థానిక ఎమ్మెల్యే శ్రీగణేష్ హాజరయ్యారు. వీరితో పాటు స్థానిక నాయకులు జె ప్రతాప్, ఎం. అమరేంధర్ రెడ్డి, సాధాఆనంద్, మారుతీ గౌడ్, సయ్యద్ రేయాజుదిన్, హరికృష్ణ, రాజు, నేతాజీ నగర్ కుమార్, బద్రీనాథ్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, జమీల్, అశోక్, ముఖేష్ యాదవ్, సదా ఆనంద్ గౌడ్, బాబు రావు, నగేష్ యాదవ్ పాల్గోన్నారు.