Home TELANGANA కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కుల అందజేసిన కంటోన్మెంట్ MLA శ్రీగణేష్

కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కుల అందజేసిన కంటోన్మెంట్ MLA శ్రీగణేష్

0
125

సికింద్రాబాద్ మండల పరిధిలోని కంటోన్మెంట్ ప్రాంత 19 మంది లబ్ధిదారుల కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి 1,00,116/- రూపాయల చొప్పున ప్రభుత్వం నుంచి కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు మంజూరు అయ్యాయి. శుక్రవారం పికెట్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ సికింద్రాబాద్ తహసీల్దార్ పాండు నాయక్ తో కలిసి లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే లబ్దిదారులతో మాట్లాడుతూ పేదింటి ఆడబిడ్డల వివాహ ఖర్చుల నిమిత్తం ప్రభుత్వం సహాయం చేస్తుందని, వివాహం చేసి ఆడపిల్లల తల్లిదండ్రులు అప్పులు పాలు కావొద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ పధకాన్ని అమలు చేస్తుందని కాంగ్రెస్ ప్రభుత్వం ఆలస్యం చేయకుండా చెక్కులను విడుదల చేసి పేదల పక్షపాతిగా నిలుస్తుందని అన్నారు. ఈ చెక్కులు సకాలంలో రాని వారు తనను సంప్రదిస్తే అధికారులతో మాట్లాడి త్వరితగతిన చెక్కులు మంజూరు అయ్యేలా చూస్తానని చెప్పారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here