ఇల్లందకుంటలోని సీతారామచంద్ర స్వామి ఆలయంలో ఈ నెల 15 నుంచి 27వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. నేడు శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కల్యాణం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ నెల 15నుంచి 27వరకు జరగనున్న బ్రహ్మో త్సవాలను భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా కలెక్టర్ పమేలా సత్పతి, సీపీ అభిషేక్ మొహంతి, దేవాదాయశాఖ ఆదేశాల మేరకు ఆలయ కార్యనిర్వాహణాధికారి కందుల సుధాకర్ పర్యవేక్షణలో అన్ని ఏర్పాట్లు చేశారు. హుజూరాబాద్ ఆర్డీవో రమేష్ బాబు, ఏసీపీ సిహెచ్ శ్రీనివాస్ జి. స్థానిక అధికారులచే సమీక్ష సమావేశాలు నిర్వహించి ఏర్పాట్లు పూర్తి చేశారు .
బ్రహ్మోత్సవాలకు సుమారు లక్షకుపైగా భక్తులు హాజరు కానున్నారని అంచనా. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు (శ్రీరామనవమిరోజు) జమ్మికుంట రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా వైద్య సదుపాయం అందించేందుకు 108, 104, వాహనాలను అందుబాటులో ఉంచారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏసీపీ సిహెచ్ శ్రీనివాస్ జి, జమ్మికుంట రూరల్ సిఐ కోరె కిశోర్, ఎస్ఐ రాజకుమార్ వీణవంక ఎస్సై తోట తిరుపతి లు భారీ బందోబస్తు నిర్వహించారు.ఆలయ పరిసరాల్లో సీసీ కెమెరాలు అమర్చారు.
**బ్రహ్మోత్సవాల వివరాలు,,
■15న సోమవారం రాత్రి 7 గంటలకు స్వామివారి ఉత్సవమూర్తుల బాహ్యమందిర ప్రవేశం.
■16న. మంగళవారం సాయంత్రం 6 గంటలకు విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, అంకురార్పణ.
■17న.బుధవారం ఉదయం 9గంటలకు ధ్వజారోహణం, అగ్ని ప్రతిష్ట, ఉదయం 10 గంటలకు ఎదుర్కోళ్లు, మధ్యాహ్నం 12 గంటలకు
శ్రీసీతారాముల కల్యాణం, రాత్రి 9 గంటలకు శేషవాహన సేవ.
■ 18న. గురువారం ఉదయం 10 గంటలకు పట్టాభిషేకం, సువర్ణ పుష్పార్చన, సాయంత్రం 6 గంటలకు ప్రభుత్వోత్సవం ప్రారంభం.
■ 19న. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు ప్రభుత్వోత్సవం, రాత్రి 9 గంటలకు గరుడవాహనసేవ.
▪ 20న.శనివారం సాయంత్రం 6 గంటలకు ప్రభుత్వోత్సవం, రాత్రి 9 గంటలకు హనుమత్ వాహన సేవ.
■ 21న. ఆదివారం సాయంత్రం 6 గంటలకు ప్రభుత్వోత్సవం, రాత్రి 9 గంటలకు గజవాహన సేవ, అనంతరం సదస్యం, వేదాశీర్వచనం.
■ 22న. సోమవారం సాయంత్రం 6 గంటలకు ప్రభుత్వోత్సవం ముగింపు, రాత్రి 9 గంటలకు అశ్వవాహన సేవ, దోపోత్సవం.
■23న. మంగళవారం సాయంత్రం 6 గంటలకు శకటోత్సవం, రాత్రి 7గంటలకు సూర్య రథోత్సవం( చిన్న రథం).
■24న. బుధవారం సాయంత్రం 7గంటలకు స్వామివారు చంద్రరథోత్సవం (పెద్దరథం).
■25న.గురువారం మధ్యాహ్నం 3 గంటల వరకు భక్తులకు స్వామివార్ల దర్శనం, సేవల అనంతరం తిరుమాడ వీధుల్లో చంద్రరోథత్సవం (పెద్దరథం) ఊరేగింపు. రాత్రి 7గంటలకు మహాపూర్ణాహుతి, మహాకుంభ సంప్రోక్షణ.
■26న.శుక్రవారం ఉదయం 9గంటలకు అష్టోత్తరశత (108) కలశాభిషేకం, అవబృధ చక్రస్నానం. రాత్రి 9గంటలకు ద్వాదశారాధన, శ్రీపుష్పయాగం (నాఖబలి).
■27న. శనివారం రాత్రి 7గంటలకు సప్త వరణాలా ఏకాంతసేవ.
భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్టు ఆలయ కార్య నిర్వహణ అధికారి కందుల సుధాకర్ తెలిపారు…