Thursday, October 22, 2026
spot_img
HomeTELANGANAఈద్గా, కబ్రస్థాన్ లను సందర్శించిన మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్.

ఈద్గా, కబ్రస్థాన్ లను సందర్శించిన మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్.

జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని ఈద్గా, కబ్రస్థాన్ లను గురువారం మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్ సందర్శించారు. ఈ సందర్భంగా కమిషనర్ మహమ్మద్ అయాజ్ మాట్లాడుతూ రానున్న రంజాన్ ఉపవాసాల అనంతరం ముస్లిం సోదరులు నమాజ్ చేసేందుకు వచ్చే ఈద్గా ప్రాంతాన్ని రంజాన్ నమాజ్ అనంతరం పూర్వీకుల సమాధుల వద్దకు వెళ్లడానికి కబ్రస్థాన్ లలో ఏపుగా పెరిగిన పిచ్చి మొక్కలను పారిశుద్య కార్మికులతో శుభ్ర0 చేయించామన్నారు. ఈద్గా, కబ్రస్థాన్ లలో ప్రహరీ గోడలకు, ఈద్గా ప్రదేశంలో రంగులు వేసి సర్వంగాసుందరంగా అలంకరించినట్లు ఆయన తెలిపారు. కమిషనర్ మహమ్మద్ అయాజ్ వెంట శానిటరీ ఇన్స్పెక్టర్ సదానందం, పలువురు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments