Wednesday, January 22, 2025
spot_img
HomeTELANGANAబుగ్గారం జి.పి. నిధులపై లోకాయుక్త లో విచారణ

బుగ్గారం జి.పి. నిధులపై లోకాయుక్త లో విచారణ

పంచాయతీ అధికారులు తప్పుడు నివేదికలు అందజేశారని ఆరోపణ. పలు అభ్యంతరాలు తెలిపిన చుక్క గంగారెడ్డి

విజిలెన్స్ & ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులతో విచారణ జరిపించాలని విజ్ఞప్తి. పాలకులపై, అధికారులపై చట్టపరమైన చర్యలు చేపట్టి, శిక్షించాలని అభ్యర్థన

జగిత్యాల జిల్లా బుగ్గారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో జరిగిన నిధుల దుర్వినియోగం, అధికారుల నిర్లక్ష్యం పై బుధవారం హైదరాబాద్ లోని తెలంగాణ లోకాయుక్త సంస్థలో విచారణ జరిగింది. జిల్లా పంచాయతీ ఉన్నతాధికారులు అందజేసిన నివేదిక పై పిర్యాదు దారుడు చుక్క గంగారెడ్డి బుధవారం లోకాయుక్త కు పలు అభ్యంతరాలను తెలియజేశారు. అత్యున్నత స్థానంలో ఉన్న జిల్లా ఉన్నతాధికారులు కూడా బుగ్గారం జి.పి. నిధుల దుర్వినియోగంపై సరైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. కోటికి పైగా నిధులు దుర్వినియోగం అయినా పట్టించుకోవడం లేదన్నారు. రూ.50,00,000 యాబై లక్షలకు పైగా నిధుల దుర్వినియోగం బయట పడి ఆధారాలు అందజేసినా జిల్లా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆయన లోకాయుక్త సంస్థకు వివరించారు. దుర్వినియోగం అయిన సొమ్ములో మూడున్నర ఏండ్ల క్రితమే రూ.4,42,761 లు రికవరీ చేసిన అధికారులు లోకాయుక్త కు రూ.1,77,761 -00 లు మాత్రమే రికవరీ చేశామని తప్పుడు సమాచారం ఇచ్చారని ఆయన సూచించారు. రికవరీ అయిన ఛాలాన్ జిరాక్స్ ప్రతులను ఆయన లోకాయుక్త కు అందజేశారు. చేయని పనులకు దొంగ రికార్డులు సృష్టించి నిధులు డ్రా చేశారని, ఇందుకు వివిధ శాఖల అధికారులు కూడా కుమ్మక్కై సర్వ విధాలుగా సహకరించడం జరిగిందన్నారు. అధికారులు కూడా తప్పుడు వాంగ్మూలం ఇచ్చారని ఆయన సూచించారు.
ప్రజా క్షేత్రంలో జరిగిన విచారణ లో బయటపడ్డ బోర్ వెల్, త్రాగు నీటి బావి లకు సబంధించిన దొంగ రికార్డులు, దొంగ బిల్లులు , పోర్జరీ సంతకాల పత్రాలు, దొంగ ధృవీకరణ పత్రాలు, దొంగ, తప్పుడు తీర్మానాల పత్రాలు, వార్తా పత్రికలలో ప్రచరితమైన కథనాల ప్రతులు, ఛానల్ లలో ప్రచురితం అయిన వీడియో వార్తల లింక్ లు లోకాయుక్త కు చుక్క గంగారెడ్డి బుధవారం అందజేశారు.
తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం -2018 ప్రకారం బాధ్యులైన సర్పంచ్ మూల సుమలత శ్రీనివాస్ గౌడ్, ఉప సర్పంచ్, ఇద్దరు పంచాయతీ కార్యదర్శులను వెంటనే సస్పెండ్ చేయాలని ఆయన లోకాయుక్త ను కోరారు. లేని పక్షంలో ఈ ఐదు నెలల వారి పదవీ కాలంలో మరింత ఎక్కువగా నిధుల దుర్వినియోగం జరిగే ప్రమాదం కూడా పొంచి ఉందని అన్నారు. అలాగే విధులను, బాధ్యతలను, వారి అధికారాలను సైతం దుర్వినియోగం చేస్తూ, నిర్లక్ష్యంగా వ్యవహరించి, మరింత ఎక్కువగా నిధుల దుర్వినియోగాన్ని ప్రోత్సహించే విధంగా చేసిన జిల్లా పంచాయతీ ఉన్నతాధికారులను, ఇతర అధికారులను, సమాచార కమీషన్ తీర్పులను, జిల్లా కలెక్టర్ ఆదేశాలను భేఖాతర్ చేసిన అధికారులను
అందరినీ కూడా చట్టపరంగా చర్యలు తీసుకొని కటినంగా శిక్షించాలని లోకాయుక్త సంస్థ రిజిస్ట్రార్ ను చుక్క గంగారెడ్డి కోరారు.
విజిలెన్స్ & ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులతో గానీ, ఇతర నిఘా విభాగాల అధికారులతో గానీ సమగ్ర విచారణ జరిపించి బాద్యులందరినీ శిక్షించి, మొత్తం సొమ్ము రికవరీ చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దాదాపు నాలుగేండ్లు గా చేస్తున్న తన న్యాయ పోరాటానికి ఇక లోకాయుక్త ద్వారానే తగిన న్యాయం జరిగి, దుర్వినియోగం అయిన ప్రజల సొమ్మంతా రికవరీ చేసి, ఇలాంటీ సంఘటనలు మరెక్కడా కూడా పునరావృతం కాకుండా చూడాలని ఆయన లోకాయుక్త ను అభ్యర్థించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments